Anil Ravipudi : టాలీవుడ్ లో విక్టరీ వెంకటేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు సంక్రాంతికి వస్తున్నాం చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఈనెల 14న విడుదల చేస్తున్నామని, ప్రతి ఒక్కరు నవ్వకుండా ఉండలేరని అన్నారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచి పోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Anil Ravipudi Praises..
ఇందులో కామెడీకి కొదువ లేదు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉంటారని అన్నారు. తాను తీసిన ఏడు సినిమాలను ఆదరించారని, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఎఫ్-2, ఎఫ్-3 మూవీస్ తో తమ ప్రయాణం కంటిన్యూగా కొనసాగుతోందని చెప్పారు. ప్రధానంగా తనకు వెంకటేశ్ ఓ టీచర్ లా, ఓ స్నేహితుడిలా, స్టూడెంట్ గా , మరో వైపు పెద్ద మనిషిలా కనిపిస్తారని అన్నారు. ఒక వ్యక్తిలో ఇన్ని లక్షణాలు ఉండడం చాలా అరుదు అని పేర్కొన్నారు దర్శకుడు.
తను సెట్స్ లోకి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లేంత దాకా చాలా జోవియల్ గా ఉంటూ సినిమాను నడించారని కొనియాడారు. మొత్తంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం భారీ సక్సెస్ మూట గట్టుకోవడం ఖాయమన్నారు.
Also Read : Victory Venkatesh Movie : సంక్రాంతికి వస్తున్నాం నవ్వులు ఖాయం