Animal Director : ఆ హీరోతో సినిమాకి సిద్ధంగా ఉన్నానంటున్న సందీప్ వంగా

వైరల్ అవుతున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వ్యాఖ్యలు

Hello Telugu - Animal Director

Animal Director : ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో సందీప్‌రెడ్డి వంగ భారీ విజయాన్ని అందుకున్నారు. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఆ తర్వాత ఈ చిత్రం హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేయబడి అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఈ రెండు చిత్రాల తర్వాత కొంత విరామం తీసుకున్న సందీప్ ప్రస్తుతం యానిమల్ చిత్రంతో పాన్-ఇండియా బాక్సాఫీస్ వద్ద పెద్ద సందడి చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, రష్మిక మందన నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది.

Animal Director Comment

ఈ సినిమాతో దర్శకుడు సందీప్ మరోసారి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. సందీప్ తదుపరి చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది. వీరిద్దరూ తమ తదుపరి సినిమాకి “స్పిరిట్` అనే టైటిల్‌ను ప్రకటించారు. దీని తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. వీరిద్దరితో పాటు తన అభిమాన హీరోలతో కూడా సినిమా చేయాలనే కోరికను వ్యక్తం చేసారు. సందీప్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

తన మొదటి సినిమా.. ‘అర్జున్ రెడ్డి’తో అటెన్షన్‌ను సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) ఇటీవల విడుదలైన ‘యానిమల్’ సినిమాతో ఇండియా స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇంత క్రేజీ ఉన్న స్టార్ డైరెక్టర్. తన ఫేవరెట్ హీరో చిరు తనయ రామ్ చరణ్‌తో సినిమా చేయాలనుకుంటున్నారట.

ఇటీవల మహబూబా బాద్ ప్రాంతాన్ని సందర్శించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, తన ప్రియమైన వారి గురించి తన ఆలోచనలను పంచుకున్నారు. బాస్ మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాదు, లిటిల్ బాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నట్లు మొదట్లో చెప్పారు. ఈ మాటలతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నారు వంగ.

Also Read : Kamal Hasan: ఫైట్ మాస్టర్ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ కొత్త సినిమా !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com