Anirudh Ravichander : అనిరుధ్ హ‌వా మ్యూజిక్ కు ఫిదా

త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో టాప్

ఏ సినిమా అయినా హిట్ కావాలంటే ద‌ర్శ‌కుడితో పాటు సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్ట‌ర్ బాగుండాలి. సంగీతం ప‌రంగా స‌క్సెస్ అయితే చాలు ఇక మూవీ బిగ్ హిట్ అన్న టాక్ ఇప్పుడు ప్ర‌తి సినీ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

తాజాగా ఒక కెర‌టం లాగా దూసుకు వ‌చ్చాడు త‌మిళ సినీ రంగానికి చెందిన సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్. మ‌నోడు వ‌రుస హిట్ల‌తో దూసుకు పోతున్నాడు. భారీ డిమాండ్ ఉంటోంది అత‌డి మ్యూజిక్ కు. తాజాగా త‌ను అందించిన రెండు సినిమాలు ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యాయి.

ఇందులో ఒక‌టి నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ , త‌మ‌న్నా భాటియా న‌టించిన జైల‌ర్ చిత్రం కావ‌డం. రెండోది ఇదే త‌మిళ సినీ రంగంలో టాప్ యంగ్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన షారుక్ ఖాన్, న‌య‌న‌తార‌, దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టించిన జ‌వాన్ కు కూడా అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ ఇచ్చాడు.

ఈ రెండు సినిమాలు ఇప్ప‌టికే రూ. 600 కోట్ల మార్క్ ను దాటాయి. ఇప్ప‌టికే జైల‌ర్ స‌క్సెస్ తో ఆ సినిమా నిర్మాత‌, ఎంపీ క‌ళానిధి మార‌న్ అయితే ఏకంగా అనిరుధ్ ర‌విచంద‌ర్ కు రూ. 30 కోట్లు ఇచ్చారు. తాజాగా లోకేష్ క‌న‌గ‌రాజ్ తో ర‌జనీకాంత్ సినిమా తీయ‌బోతున్నాడు. దానికి కూడా అనిరుధ్ ను ప్ర‌క‌టించింది నిర్మాణ సంస్థ‌.

సో వ‌రుస హిట్ల‌తో టాప్ రేంజ్ లో కొన‌సాగుతున్న అనిరుధ్ కు భారీ డిమాండ్ పెరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com