కావ్య మార‌న్ తో అనిరుధ్ ర‌విచంద‌ర్ డేటింగ్..?

త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారా

సీన రంగానికి, క్రికెట్ కు చాలా ద‌గ్గ‌రి సంబంధాలు ఉంటాయి. గ‌తంలో ఎంద‌రో క్రికెట‌ర్లు డేటింగ్ చేశారు..ఆ త‌ర్వాత పెళ్లి చేసుక‌న్నారు..చివ‌ర‌కు విడి పోయారు కూడా. భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బాలీవుడ్ న‌టి సంగీతా బిజ్ఞానీని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఈ ఇద్ద‌రూ విడి పోయారు. గ‌తంలో ర‌వి శాస్త్రి అమృతా సింగ్ తో, అజ‌య్ జ‌డేజా న‌టి మాధురి దీక్షిత్ తో పెళ్లి దాకా వెళ్లింద‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఉన్నారు.

తాజాగా త‌మిళ సినీ రంగానిక చెందిన రాక్ స్టార్, మ్యూజిక్ కింగ్ అనిరుధ్ ర‌విచంద‌ర్ స‌న్ పిక్చ‌ర్స్ య‌జ‌మాని , డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్ ముద్దుల త‌న‌య‌, ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీం ఓన‌ర్, సీఈఓ కావ్య మార‌న్ గ‌త కొంత కాలంగా డేటింగ్ లో ఉన్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగ‌తోంది. అంతే కాకుండా ఇద్ద‌రూ పెళ్లికి కూడా సిద్ద‌మైన‌ట్లు విశ్వ‌సనీయ స‌మ‌చారం. అనిరుద్ , కావ్య పాప గ‌త ఏడాదికి పైగా పీక‌ల లోతు ప్రేమ‌లో కూరుకు పోయిన‌ట్లు కోలీవుడ్ లో గుస గుస‌లు వినిపిస్తున్నాయి.

అనిరుధ్ ప్ర‌స్తుతం కోలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా కొన‌సాగుతుండ‌గా ఇక కావ్య మార‌న్ వేల కోట్ల ఆస్తుల‌కు వారసురాలిగా ఉన్నారు. ఇక సంగీత ద‌ర్శ‌కుడికి 34 ఏళ్లు కాగా కావ్య పాప‌కు 32 ఏళ్లు. త‌ను ఎంబీ ఏ చేసింది. ప‌లు సంస్థ‌ల‌కు సిఇఓగా ప‌ని చేస్తోంది. ఎప్పుడైతే ఎస్ ఆర్ హెచ్ ను టేకోవ‌ర్ చేసుకుందో ఆనాటి నుంచి నేటి దాకా ఐపీఎల్ ప‌రంగా కావ్య మార‌న్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. త‌న అందంతో కోట్లాది మందిని క‌ట్టి ప‌డేశారు. ఇక అనిరుధ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పాట‌లు, మ్యూజిక్ ప‌రంగా టాప్ లో కొన‌సాగుతున్నాడు. ఇద్ద‌రి డేటింగ్ గురించి ఇరు కుటుంబాలకు తెలుస‌ని, త్వ‌ర‌లోనే ఏడు అడుగులు వేయ‌బోతున్న‌ట్లు టాక్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com