Anupama Parameswaran: హర్టయిన అనుపమ ! ‘టిల్లు స్కేర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డుమ్మా ?

హర్టయిన అనుపమ ! 'టిల్లు స్కేర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డుమ్మా ?

Hello Telugu - Anupama Parameswaran

Anupama Parameswaran: ‘అఆ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… ‘శతమానం భవతి’, ‘కార్తికేయ 2’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి ముద్ర వేసుకున్న అనుపమ… ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ పెంచింది. హీరోయిన్‌ అన్నాక అన్ని రోల్స్‌ చేయాలి. బరి గీసుకుని ఉంటే పెద్దగా అవకాశాలు రావు. ఆ విషయం తెలుసుకున్న అనుపమ పరమేశ్వరన్‌ బోల్డ్‌ పాత్రలకు ఓకే చెప్పింది.

Anupama Parameswaran Feel..

దీనిలో భాగంగా దిల్ రాజు మేనల్లుడు ఆశిష్‌ హీరోగా చేసిన ‘రౌడీ బాయ్స్’లో లిప్ కిస్ సీన్స్‌లో నటించి అందరూ అవాక్కయ్యేలా చేసిని ఈ బ్యూటీ… తాజాగా ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ కు తెరకెక్కిస్తున్న ‘టిల్లు స్క్వేర్’ లో మరింత రెచ్చిపోయింది. ‘టిల్లు స్క్వేర్’ లో హీరో సిద్ధు జొన్నలగడ్డతో ముద్దులు, హగ్గులతో కుర్రకారును మరింత రెచ్చగొట్టింది. దీనితో ఒక్కసారిగా షాక్ కు గురైన అనుపమ అభిమానులు… ఇలా తయారైందేంటని కోపంతో ఊగిపోయారు. ‘అఆ’, ‘శతమానం భవతి’ సినిమాలతో అచ్చతెలుగు ఆడపిల్లలా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీను ఒక్కసారిగా బోల్డ్ పాత్రల్లో చూడలేక… ఆమెకు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

దీనితో అభిమానుల కామెంట్లపై స్పందించిన అనుపమ(Anupama Parameswaran)…. ఎప్పుడూ ఒకేరకమైన పాత్రలు చేస్తే బోర్‌ కొడుతుంది కదా… అందుకే ఈ సినిమా ఒప్పుకున్నానని తన అభిమానులకు సర్థి చెప్పే ప్రయత్నం చేసింది. అయినా ఫ్యాన్స్‌ ఆవేశం చల్లారలేదు. దీనితో ఇటీవల ‘టిల్లు స్కేర్’ నుండి విడుదలైన ఓ పోస్టర్ ద్వారా తనను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో బుధవారం నిర్వహించిన ‘టిల్లు స్క్వేర్’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కు అనుపమ డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. తొలుత బిజీ షెడ్యూల్ వలన అనుపమ ఈ కార్యక్రమానికి దూరమై ఉంటుందని అందరూ భావించినా… హీరో సిద్ధూ జొన్నలగడ్డ స్టేజీపై స్పందించిన తీరు మాత్రం అనుపమ హర్ట్ అయినట్లు తేటతెల్లం చేస్తుంది.

ఇటీవల ‘టిల్లు స్క్వేర్’ సినిమా నుంచి లేటెస్ట్‌గా ఓ పోస్టర్‌ రిలీజైంది. దానికింద అనుపమ అభిమానులు చాలా కామెంట్స్‌ చేశారు. దీనిపై స్పందించిన హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ… ఒక అమ్మాయి గురించి అలా అనడం కరెక్ట్‌ కాదేమో ! మనం ఒకరిని ఫ్లర్ట్‌ చేస్తే అవతలివాళ్లు ఎంజాయ్‌ చేసేలా ఉండాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండొద్దు. పిచ్చిపిచ్చిగా కామెంట్స్‌ చేశారు. నా అభ్యర్థన ఏంటంటే వల్గర్‌ గా మాట్లాడొద్దు. ఆరోగ్యకర వాతావరణం ఉంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. అభిమానులు పెట్టిన నెగెటివ్‌ కామెంట్స్‌ కు హర్ట్‌ అయినందువల్లే అనుపమ ఈవెంట్‌ కు రాలేదని తెలుస్తోంది. ఇకపోతే టిల్లు స్క్వేర్‌ మార్చి 29న రిలీజ్‌ కానుంది.

Also Read : Ayesha Khan: యూత్ ను ఊపేస్తున్న అయేషా ఖాన్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com