అగ్నిహోత్రి కామెంట్స్ అనురాగ్ క‌శ్య‌ప్ సీరియ‌స్

బాలీవుడ్ ద‌ర్శ‌కుల మ‌ధ్య మాటల యుద్దం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ సీరియ‌స్ అయ్యారు. త‌న గురించి అవాకులు చెవాకులు పేల‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తాను తాగుబోతునంటూ చిల్ల‌ర కామెంట్స్ చేసిన ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి గురించి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నాడు. తాజాగా చిట్ చాట్ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని అభిప్రాయాల‌ను పంచుకున్నాడు వివేక్. ఇదే స‌మ‌యంలో అనురాగ్ క‌శ్య‌ప్ గురించి నోరు జారాడు. తామిద్ద‌రం సినిమా కోసం ప‌ని చేస్తున్న స‌మ‌యంలో క‌శ్య‌ప్ మ‌ద్యం సేవించి వ‌చ్చే వాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ సందర్భంగా వివేక్ అగ్నిహొత్రో చేసిన కామెంట్స్ సంచ‌ల‌నం రేపాయి. త‌ను పూర్తిగా మోదీకి, భార‌తీయ జ‌న‌తా పార్టీకి, దాని అనుబంధ సంస్థ‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ సినిమాలు తీస్తూ వ‌చ్చాడు. ఆ మ‌ధ్య‌న కాశ్మీర్ ఫైల్స్ తీశాడు. ఇది బిగ్ స‌క్సెస్ అయ్యింది. పెద్ద ఎత్తున కాసులు కూడా వ‌చ్చాయి. దీనిపై స్పందించిన రామ్ గోపాల్ వ‌ర్మ అది సినిమానే కాద‌న్నాడు. డాక్యుమెంట‌రీ కంటే త‌క్కువేనంటూ సెటైర్ వేశాడు.

ఇక బాలీవుడ్ లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన ద‌ర్శ‌కుడు ఆర్జీవీ. తను స‌పోర్ట్ చేసిన వారిలో ఎంద‌రో నటీన‌టులు అయ్యారు. మ‌రికొంద‌రు టాప్ ద‌ర్శ‌కులుగా, సాంకేతిక నిపుణులుగా చెలామ‌ణి అవుతూ వ‌చ్చారు. ఇది ప‌క్క‌న పెడితే వివేక్ అగ్నిహోత్రి త‌న‌ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు క‌శ్య‌ప్. ఈ ఇద్ద‌రి మాట‌ల యుద్దం తారా స్థాయికి చేరింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com