అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తను పలు విజయవంతమైన సినిమాలలో నటించింది..మెప్పించింది. ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ప్రత్యేకించి ప్రభాస్ తో తను నటించిన మిర్చి, బాహు బలి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదే సమయంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మరో మూవీ మాస్ మహారాజా రవితేజతో కలిసి చేసిన విక్రమార్కుడు సెన్సేషన్ క్రియేట చేసింది. ఆ మధ్యన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో తెర పంచుకుంది. ఆ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి.
తాజాగా చిట్ చాట్ చేసింది. ఎందుకు ఇంతగా గ్యాప్ తీసుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. కొంత విరామం తీసుకున్న మాట వాస్తవమేనని, ఇక నుంచి అలాంటిది ఉండదని పేర్కొంది అనుష్క శెట్టి. తను ప్రస్తుతం ఘాటి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. మూవీ మేకర్స్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను , గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. వాటికి మంచి స్పందన లభించింది.
అనుష్క శెట్టితో పాటు తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రభు ఇందులో నటిస్తుండడం విశేషం. యువి క్రియేషన్స్ ఆధ్వర్యంలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి దీనిని నిర్మిస్తున్నారు ఘాటి చిత్రాన్ని. దీనికి దర్శకత్వం వహిస్తున్నారు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. తను ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్నారు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా హరి హర వీరమల్లు నుంచి తప్పుకున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఎంఎం రత్నం సోదరుడి తనయుడు జయృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఘాటికి సంబంధించి మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. జూలై 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు చిత్రం రానుందని వెల్లడించారు. ఇదే దర్శకుడు తీసిన వేదం సినిమాలో కీ రోల్ పోషించింది అనుష్క శెట్టి. ఇద్దరి కాంబోలో మరో మూవీ రానుండడంతో అంచనాలు పెరిగాయి ఘాటిపై.