Anushka : సినీ ఇండస్ట్రీలో దమ్మున్న డైరెక్టర్ గా పేరు పొందాడు వంగా సందీప్ రెడ్డి. తను తీసింది కొన్ని మూవీస్ అయినా అవన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కోట్లు కురిపించేలా చేశాయి. తన టేకింగ్ మేకింగ్ తో విస్తు పోయేలా చేశాడు. గతంలో విజయ్ దేవరకొండతో తీసిన అర్జున్ రెడ్డి దుమ్ము రేపింది. తనకు స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చేలా చేసింది. ఆ తర్వాత పరుశురామ్ తీసిన గీత గోవిందం సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఇదే మూవీని హిందీలో షాహిద్ కపూర్ తో తీశాడు. ఇది బిగ్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ లో రణ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, బాబీ డియోల్ తో యానిమల్ తీశాడు.
Anushka Shetty in Prabhas, Sandeep Reddy Vanga ‘Spirit’ Movie
ఇది ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. ఏకంగా రూ. 1000 కోట్లు కలెక్షన్స్ సాధించింది. సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చాడు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో మూవీ తీస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే కథ కూడా వినిపించాడు. దీనికి ఓకే చెప్పాడు డార్లింగ్. ఇప్పటికే మూవీకి సంబంధించి టైటిల్ కూడా ఖరారు చేశాడు. దాని పేరు స్పిరిట్. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్ ఇటలీలో. ఆయనతో పాటు హీరోయిన్ గా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది సినీ ఇండస్ట్రీలో దీపికా పదుకొనే కీ రోల్ పోషిస్తోందని.
తాజాగా మరో అప్ డేట్ వచ్చింది స్పిరిట్ మూవీ నుంచి ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్ సక్సెస్ కాంబినేషన్ హీరోయిన్ గా పేరుంది లవ్లీ బ్యూటీ అనుష్క శెట్టి(Anushka). స్పిరిట్ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, సెకాండఫ్ లో వచ్చే మీరోయిన్ కు తనే కరెక్టుగా సరి పోతుందని వంగా సందీప్ రెడ్డి భావించాడని, తనతో టాక్స్ కూడా పూర్తయినట్లు సమాచారం. మొత్తంగా చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ కలవబోతుండడంతో ఫ్యాన్స్ తెగ సంబుర పడుతున్నారు.
Also Read : Beauty Trisha-Chiranjeevi :మెగాస్టార్ సరసన ముద్దులగుమ్మ