Anushka : నందమూరి బాలయ్యతో కలిసి నటించింది లవ్లీ బ్యూటీ అనుష్క శెట్టి. ఇందులో అందాలను ఆరబోసింది. ఒక రకంగా ఆ మధ్యన అభిమానులు సైతం ఆమెను తప్పు పట్టారు. ఇంతలా దిగజారి పోతే ఎలా అని. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించింది..మెప్పించింది. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకుంది. ఎస్ఎస్ రాజమౌళి తీసిన విక్రమార్కుడులో కీ రోల్ చేసింది. ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో భిల్లా తో పాటు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన బాహుబలిలో నటించింది.
Anushka Shetty Comments
ఆ తర్వాత తమిళం, తెలుగు సినిమాలలో ఛాన్స్ లు దక్కించుకుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంది.
ఈ సందర్బంగా అనుష్క శెట్టి(Anushka) చిట్ చాట్ చేసింది. తన అభిప్రాయాలను పంచుకుంది. బాలయ్యతో ఒక్క మగాడులో నటించాల్సి ఉండేది కాదని అభిప్రాయపడింది. ఆ సినిమా వల్ల తనకు బ్యాడ్ ఇమేజ్ వచ్చిందని వాపోయింది. ప్రస్తుత్ం ఓ మూవీలో నటిస్తోంది. మరో వైపు తనతో నటించిన, స్క్రీన్ చేసుకున్న హీరోలంతా ఫుల్ బిజీగా మారి పోయారు. కానీ తను మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తోంది.
అయితే ఈ గ్యాప్ , సినిమాలు లేక పోవడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో ఎడాపెడా సినిమాలు చేసేందుకు ఒప్పుకున్నానని కానీ ఇప్పుడు తన కెరీర్ కు సంబంధించి కేవలం మంచి పాత్రలు చేసేందుకే ప్రయారిటీ ఇస్తున్నానని చెప్పింది అనుష్క శెట్టి. వ్యాంప్ పాత్రలకంటే క్యారక్టర్ కలిగిన పాత్రలే ఎల్లకాలం గుర్తుండి పోతాయని అంటోంది ఈ ముద్దుగుమ్మ.
Also Read : Niram Marum Ulagil OTT Sensational :సన్ నెక్స్ట్ లో నిరం మారుమ్ ఉలగిల్ స్ట్రీమింగ్