అమరావతి – ఏపీ కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన కీలక సమీక్ష చేపట్టారు. గత ఎన్నికల ప్రచారం సందర్బంగా తాము ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఆగస్టు 15 (దేశానికి స్వేచ్ఛ లభించిన రోజు) ను పురస్కరించుకుని మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. దీని వల్ల మహిళా సాధికారత ఏర్పడుతుందన్నారు. ఒక్కో మహిళలకు గరిష్టంగా నెలకు రూ. 5 వేలకు పైగానే మిగిలే ఛాన్స్ ఉందన్నారు సీఎం.
ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము ఇచ్చిన మాట మేరకు కట్టుబడి ఉన్నామని, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. పేదలకు మేలు చేకూర్చేలా ప్రతి నెలా ఒకటో తారీఖునే పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. మహిళల అభివృద్ది కోసం కట్టుబడి ఉన్నామని అన్నారు. తమ సర్కార్ వారిని కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యమన్నారు. అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
అంతే కాకుండా మారుతున్న టెక్నాలజీని వ్యవసాయ రంగానికి అన్వయించేలా చూస్తున్నామని చెప్పారు. రైతులను ఆదుకుంటామన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని హార్టీకల్చర్ హబ్ గా మారుస్తామని ప్రకటించారు సీఎం. స్వర్ణాంద్ర స్వచ్చాంద్రలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రైతు బజార్లను ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూల్ లో రూ. 6 కోట్లతో సర్వాంగ సుందరంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 21 నుంచి వచ్చే జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా మంత్ చేపడుతున్నట్లు ప్రకటించారు.