తెలుగు జాతిలోనే పుట్టాలని కోరుకుంటా

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

హైద‌రాబాద్ – ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా తెలుగు వారు క‌నిపిస్తార‌ని, తెలుగు జాతి గొప్ప‌ద‌ని అన్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. తెలుగు వ‌న్ డిజిట‌ల్ మీడియా వ‌జ్రోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ ఎన్ని జ‌న్మ‌లు ఎత్తినా తాను తెలుగు జాతిలోనే పుట్టాల‌ని కోరుకుంటాన‌ని చెప్పారు. కంఠంనేని రవిశంకర్ అమరావతి రాజధానిపైనా సినిమా కూడా తీశారని గుర్తు చేశారు. నాడు భయపెట్టే పరిస్థితులు ఉన్నా వెనక్కి తగ్గకుండా న్యాయం, ధర్మోం అమరావతికి అన్యాయం జరిగిందని చెప్పి సినిమా తీశారు. సెన్సార్ పేరుతో విడుదల కానివ్వకుండా చేస్తే య్యూటూబ్‌లో వదిలారు. 2000 మంది పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారు. ఆయన సేవా కార్యక్రమాల పట్ల అభినందనలు తెలుపుతున్నాను.

నేను అరెస్టైన సమయంలో హైదరాబాద్‌లో మీరు పోరాడిన విధానం నా జీవితంలో మర్చిపోలేనని అన్నారు చంద్ర‌బాబు నాయుడు. మనం మంచిపని చేస్తే ప్రజలు మర్చిపోతారు అని అంటుంటారు..కానీ ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది అరెస్టు సమయంలో చూశాన‌ని చెప్పారు. ఆగస్టు సంక్షోభం వచ్చినప్పుడు ఎన్టీఆర్‌కు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా సీఎం పదవి నుంచి దించేశారు.

ఆ సమయంలో ఈనాడు దినపత్రిక చూపిన చొరవతో 30 రోజుల్లోనే తిరిగి ఎన్టీఆర్ మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. పేదరికాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పీ4 ద్వారా అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కింద స్థాయిలో ఉన్నవారిని దత్తత తీసుకుంటే మనతో సమానంగా పైకి వస్తారు. ఎన్టీఆర్ కూడా సాధారణ కుటుంబంలో పుట్టి అచెంచలమైన ఆత్మవిశ్వాసంతో పైకొచ్చారు. మళ్లీ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు రారు..ఆయనతో పోల్చుకోవాలంటే మళ్లీ ఆయనే జన్మించాల‌ని అన్నారు.

ఐటీని ప్రమోట్ చేయాలనే హైటెక్ సిటీ నిర్మించా. మన వారికి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాం. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఇండియన్స్ ఉంటారు, అందులో అగ్రభాగాన తెలుగువారు ఉన్నారు. హైటెక్ సిటీ నిర్మిస్తుంటే అందరూ నవ్వారు..కానీ తర్వాత దాని ఫలాలు అందుతున్నాయి. ప్రస్తుత సమయంలో కష్టపడాల్సిన అవసరం లేదు…స్మార్ట్‌గా చేయాలి. నాలెడ్జ్ ఎకానమీలో హిస్టారికల్ సమాచారం ఉంది. ఏ రంగం తీసుకున్నా ఇప్పుడు ఏఐ వచ్చింది. రియల్ టైంలో డేటా సేకరించే అవకాశం వచ్చింది. నాడు హైటెక్ సిటీ, ఐటీ గురించి మాట్లాడాను…ఇప్పుడు ఏఐతో క్వాంటమ్ వ్యాలీ అని చెప్తున్నాను. 2047 నాటికి ప్రపంచలో ఇండియన్స్ ముందుంటే అందులో తెలుగువారు అగ్రభాగాన ఉండాలనేది నా ఆశయం..ఇది సాధ్యమవుతుంది. భారతీయులతో పొటీ పడేవారు ప్రపంచంలో ఎక్కడా లేరు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com