అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించాలని చూస్తే ఊరుకోనంటూ హెచ్చరించారు. ఎవరినీ ఊరికే వదిలే ప్రసక్తి లేదన్నారు. తానంటే ఏమిటో ఇతర రాజకీయ పార్టీలకు బాగా తెలుసన్నారు. పాలిటిక్స్ లో జగన్ రెడ్డీని ఉద్దేశించి నువ్వో బచ్చా అని అర్థం వచ్చేలా మాట్లాడారు. తమను ఇబ్బంది పెట్టిన వారిని ఏ ఒక్కరినీ వదల బోమన్నారు. అవును ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు.
రాష్ట్రంలో జగన్ రెడ్డి అనే భూతం తిరుగుతోందన్నారు. దానికి ఎలా బుద్ది చెప్పాలో తనకు బాగా తెలుసన్నారు నారా చంద్రబాబు నాయుడు. రాజకీయం అంటే తమాషాగా ఉందా అని అన్నారు. మోసాలు, నేరాలు చేసి ఎదుటి వారి మీద వేయడం కాదన్నారు.. ప్రతిపక్షంలో ఉండి రౌడీయిజం చేస్తానంటే ఊరుకుంటానా అని అన్నారు. జగన్ రెడ్డికి తన విషయం పూర్తిగా తెలియదన్నారు.
ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు. రౌడీయిజం చేస్తామంటే నోరు మాయించే శక్తి టీడీపీకి ఉందని స్పష్టం చేశారు. పులివెందుల మార్క్ రాజకీయం చేస్తానంటే తోక కట్ చేస్తానని అన్నారు.. ఊరికొకడు తయారయ్యాడు.. అందరి పని చెప్తామన్నారు. నోటికి వచ్చినట్లు ఎలా పడితే అలా మాట్లాడితే తానే కాదు యావత్ ప్రజానీకం ఊరుకోదన్నారు. అందుకే జగన్ రెడ్డికి షాక్ ఇచ్చారని, కేవలం 11 సీట్లకే పరిమితం చేశారంటూ గుర్తు చేశారు. ఇకనైనా జగన్ జాగ్రత్తగా ఉండాలని అన్నారు.