జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం – సీఎం

పెండింగ్ స‌మ‌స్య‌ల‌పై 11 అంశాల‌తో విన‌తిప‌త్రం

విశాఖ‌ప‌ట్నం జిల్లా – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈనెల 21న నిర్వ‌హించే యోగా డే కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ హాజ‌ర‌వుతున్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. యోగా డేను పుర‌స్క‌రించుకుని యోగా ర్యాలీ నిర్వ‌హిస్తారు. ఇందులో 5 ల‌క్ష‌ల మంది పాల్గొంటార‌ని స్ప‌ష్టం చేశారు సీఎం . ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల‌కు పైగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్నార‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా విశాఖ నగర పర్యటనకు విచ్చేసిన చంద్రబాబు నాయుడు కు సింహాచలం అప్పన్న చందన ప్రసాదాన్ని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, నావెల్ డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు అందజేశారు.

ఈ మేరకు సోమవారం విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలుసుకొని అత్యంత మహిమాన్వితమైన చందన ప్రసాదం శ్రీనుబాబు అందజేయగా ముఖ్యమంత్రి వెంటనే కళ్ళకు అద్దుకొని దానిని స్వీకరించారు.

అలాగే జర్నలిస్టులుకు సంబందించిన 11 పెండింగ్ సమస్యలపై ముఖ్యమంత్రికి శ్రీనుబాబు వినతిపత్రం అందజేశారు. ఇళ్ల స్థలాల సమస్యతోపాటు ప్రధానమైన 11 అంశాలు ఈ వినతిపత్రంలో పొందుపరిచినట్లు విపులంగా వివరించారు. వీటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నట్లు శ్రీను బాబు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com