మంచు మోహన్ బాబు సమర్పణలో నిర్మించిన చిత్రం కన్నప్ప. ఇందులో మంచు విష్ణుతో పాటు పాన్ ఇండియా హీరో ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, లవ్లీ బ్యూటీ కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. ఇప్పటికే విష్ణు మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. తొలుత అమెరికా నుంచి స్టార్ట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే తీవ్ర వివాదానికి దారి తీసింది. చిత్రానికి సంబంధించిన హార్డ్ డిస్క్ ను మంచు మనోజ్ ఇంట్లో పని చేసే ఇద్దరు చోరీ చేశారంటూ విష్ణు సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. దీనిపై మనోజ్ స్పందించ లేదు. ఇదిలా ఉండగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇవాళ గుంటూరులో పాల్గొనేందుకు రానున్నారు మంచు మోహణ్ బాబు, విష్ణు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందూ బంధువులు. తమ మనోభావాలు దెబ్బ తినేలా కన్నప్ప మూవీని తీశారంటూ ఫైర్ అయ్యారు. ప్రధానంగా సనాతన ధర్మాన్ని, దేవి దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే సినిమా చిత్రీకరించారంటూ కన్నెర్ర చేశారు.
ఇందులో భాగంగా సనాతన ధర్మ జేఏసీ సంచలన ప్రకటన చేసింది. గుంటూరు లోని శంకర్ విలాస్ సెంటర్ లో నిరసన వ్యక్తం చేస్తున్నామని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ వాదులు, హిందు బంధువులు, అర్చక, పురోహిత, బ్రాహ్మణ సంఘాలు పాల్గొంటారని తెలిపింది.
