అమరావతి – దివంగత సీఎం ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ప్రకటించాలని కోరారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు . ఎన్టీఆర్ 102వ జయంతి సందర్బంగా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
ప్రతి సంవత్సరం మహానాడుకు వెళ్లి ఎన్టీఆర్ కి నివాళులర్పించే వాడినని, కానీ ఈ సంవత్సరం స్పీకర్ పదవిలో ఉండటంతో మహానాడుకు వెళ్లలే కపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ఈ రోజు ఉన్నానంటే, దానికి కారణం ఎన్టీఆర్ వల్లేనని చెప్పారు. .
ఎన్టీఆర్ కి ఎటువంటి విషయంలోనూ ఎవ్వరూ సాటి కాదని కొనియాడారు. ఆయనతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, తనకు తొలిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు.
తరువాత పలు మార్లు మంత్రిగా ఆయనతో కలిసి పని చేసిన అనుభవాన్ని పంచుకున్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటించిన మహానటుడు, విజనరీ నాయకుడు నందమూరి తారక రామారావు అన్నారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలంటూ తీర్మానం చేశారు. ఎన్టీఆర మహా నటుడిగా, ప్రజల మనసుల్లో దేవుడిగా నిలిచారని అన్నారు. ఆయన నటనతో, పాత్రల ఎంపికతో తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు. అంతేకాకుండా, ఒక సామాన్య నటుడిగా రాజకీయాల్లోకి వచ్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు.
