బహు భాషా నటుడిగా గుర్తింపు పొందారు అర్జున్ సర్జా. తను గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించాడు. కీలక పాత్రలు పోషించాడు. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు. తాను శంకర్ దర్శకత్వం వహించిన ఒక్కడు భారతీయ సినిమాను షేక్ చేసింది. అప్పట్లో అది సంచలనం క్రియేట్ చేసింది. ఒక్క రోజు సీఎంగా తను నటించిన తీరు, ఆకట్టుకునేలా తీసిన సన్నివేశాలు ఆ సినిమాను బిగ్ హిట్ గా మార్చేశాయి.
ప్రత్యేకించి ఆస్కార్ అవార్డు విన్నర్ అల్లా రఖా రెహమాన్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మెప్పించాడు నటనా పరంగా. కొంత గ్యాప్ తర్వాత సైడ్ పాత్రలలో నటించాడు. తాజాగా తను నటన నుంచి దర్శకుడిగా మారాడు అర్జున్ సర్జా. సినిమా పేరు సీతా పయనం. ఈ సినిమాలో విశేషం ఏమిటంటే తన స్వంత కూతురు ఐశ్వర్య సర్జా హీరోయిన్ గా నటిస్తోంది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ మూవీలో ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర సోదరుడి తనయుడు నిరంజన్ సుధీంద్ర హీరోగా నటిస్తుండడం విశేషం.
ఇక సీతా పయనం చిత్రాన్ని శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు. విడుదలైన టీజర్ కు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. అర్జున్ సర్జానేనా ఈ సినిమాను తీసింది అనేలా తీయడం , పలువురు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడం విశేషం. పూర్తిగా ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించాడు.
ఇందులో సత్య రాజ్, కోవై సరళ, ప్రకాశ్ రాజ్, బిత్తిరి సత్తి, సిరి హనుమంత్ తదితరులు కీ రోల్స్ లో నటిస్తున్నారు.
