Arjun Son of Vyjayanthi Success :అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి స‌క్సెస్

రూ. 12 కోట్ల‌కు పైగా వ‌సూలు

Arjun Son of Vyjayanthi Success

Arjun Son of Vyjayanthi : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ , లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి(Arjun Son of Vyjayanthi). ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి టాక్ అందుకుంది. క‌లెక్ష‌న్స్ కూడా ఆశించిన స్థాయిలో వ‌స్తుండ‌డంతో మూవీ మేక‌ర్స్ స‌క్సెస్ మీట్ లు నిర్వ‌హిస్తున్నారు. క‌థలో బ‌లం ఉంటే సినిమా త‌ప్ప‌కుండా ఆడుతుంద‌ని న‌మ్మిన వారిలో క‌ళ్యాణ్ రామ్ ఒక‌డు. స్టార్ ఇమేజ్ తో సంబంధం లేకుండా ఎవ‌రైనా స‌రే మంచి క‌థ‌తో వ‌స్తే త‌ను ప్రోత్స‌హిస్తాడు. వారికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తాడు. అలాంటి నేచ‌ర్ క‌లిగ ఉన్నాడు.

Arjun Son of Vyjayanthi Movie Success

త‌ను స‌పోర్ట్ చేసిన అనిల్ రావిపూడి ఇవాళ టాలీవుడ్ లో అత్యంత స‌క్సెస్ ఫుల్ , మినిమం గ్యారెంటీ క‌లిగిన డైరెక్ట‌ర్ గా పేరు పొందాడు. త‌ను తీసిన సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. తాజాగా అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి మూవీ ప్ర‌మోష‌న్ లో అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నాడు. త‌ను కూడా దీనిని ప్రోత్స‌హించాడు. విచిత్రం ఏమిటంటే విజ‌య‌శాంతిని తిరిగి సినిమాల్లో న‌టించేలా చేశాడు. మ‌హేష్ బాబు, ర‌ష్మిక మంద‌న్నా తో తీసిన స‌రిలేరు నీకెవ్వురు మూవీలో త‌న‌కు ఛాన్స్ ఇచ్చాడు.

ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ నంద‌మూరితో త‌ల్లి పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది రాముల‌మ్మ‌. ఆమె న‌ట‌న‌కు వంద మార్కులు వేయొచ్చు. స‌క్సెస్ మీట్ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది . ద‌య‌చేసి త‌ప్పుగా రాయొద్దంటూ కోరింది. సినిమాను బ‌తికించే ప్ర‌య‌త్నం చేయాలే త‌ప్పా చంపొద్దంటూ స్ప‌ష్టం చేసింది. త‌ను ఇటీవ‌లే ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం కూడా చేసింది. ఇక అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 12 కోట్లు వ‌సూలు చేసింది. రాబోయే రోజుల్లో ఇంకా క‌లెక్ష‌న్స్ చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు సినీ వ‌ర్గాలు. ఈ సినిమాకు ప్ర‌దీప్ చిలుకూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Also Read : Popular Director Prasanth Neel :రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన ప్ర‌శాంత్ నీల్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com