Arvind Swamy : ఇతర నటీనటులతో పోటీపడి నటించాలన్న కోరిక తనకు లేదని, తన సహజసిద్ధ నటనతో ముందుకు సాగుతానని సీనియర్ నటుడు అరవింద స్వామి అన్నారు. 2డి ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై హీరో సూర్య – జ్యోతిక దంపతులు నిర్మించగా గత నెల 27వ తేదీన ‘మెయ్యళగన్’ చిత్రంలో కార్తీ, అరవింద్ స్వామీ(Arvind Swamy), శ్రీదివ్య, దేవదర్షిణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ‘ 96’ ఫేం ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో చిత్ర బృందం ఇటీవల సక్సెస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ స్వామి మాట్లాడుతూ ఈ చిత్రంలో నా కంటే కార్తీ పాత్రకు ప్రశంసలు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇతర నటీనటుల లాగా పోటీపడి నటించాలన్న కోరిక తనకు అసలు లేదని, తన సహజ నటనతోనే భవిష్యత్తులోనూ ముందుకు సాగుతానని అన్నారు.
Arvind Swamy Comment
హీరో కార్తీ మాట్లాడుతూ, ‘ఈ సినిమా స్టోరీ అర్థం చేసుకుని మంచి రివ్యూలతో పోత్సహించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 30 యేళ్ళుదాటిన వారు జీవితంలో ఎక్కడో చోట కష్టాలను అనుభవించివుంటారు. అలాంటి వారందరికీ ఈ స్టోరీ నచ్చుతుందని బలంగా నమ్మాను. అది సక్సెస్ రూపంలో ఎంజాయ్ చేస్తున్నాం. దర్శకుడు ప్రేమ్‌కుమార్, ఎగ్జిక్యూటివర్ నిర్మాత రాజశేఖర కర్పూర పాండియన్, శక్తి ఫిలిమ్స్ అధినేత శక్తివేలన్ పాల్గొని ప్రసంగించారు.
Aldo Read : Sabari Movie : 5 నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్న ‘శబరి’ మూవీ