దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు నటి అవికా గోర్. తను ఎంచుకున్న పాత్రలలోనే నటించింది. తన చిన్ననాటి ప్రియుడు మిలింద్ చాంద్వానీతో జత కట్టింది. గత కొంత కాలం నుంచి డేటింగ్ లో పడ్డారు. వీరు కలిసి తిరిగారు. ఉన్నట్టుండి తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. కొన్నేళ్ల నుంచి ప్రేమలో మునిగి పోయారు. సోషల్ మీడియాలో అవికా గోర్, చాంద్వానీ కలిసి దిగిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇరువురికి చెందిన కుటుంబాలు ఓకే చెప్పడంతో నిశ్చితార్థం పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్బంగా ఈనెల 11న అవికా గోర్ మిలింద్ తో తన ఎంగేజ్మెంట్ ఓకే అయ్యిందంటూ అధికారికంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దీంతో ఫోటోలు ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సోషల్ మీడియా ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున సందేశాలతో నిండి పోయాయి. అవికా గోర్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది.
ఇదే సమయంలో తనను పెళ్లి చేసుకోబోయే మిలింద్ చాంద్వానీ మంచి విద్యా వేత్త. తను గుజరాత్ లోని
అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో MBA పూర్తి చేశాడు. అనేక ప్రఖ్యాత కంపెనీలలో ప్రొడక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం తను కుకు FMలో అసోసియేట్ డైరెక్టర్-ప్రొడక్ట్ పదవి నిర్వహిస్తున్నారు. తను అంతకు ముందు బైజు సంస్థలో ఇదే పోస్ట్ ను చేపట్టారు.
.
అంతే కాదు మిలింద్ ఓలా కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్ పోస్ట్ నిర్వహించారు. హైదరాబాద్ లో అనుకోకుండా అవికా గోర్ ను కలిశాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత బంధం బలేపడాలే చేసింది.
