Badshah: పాక్ నటితో బాలీవుడ్ స్టార్ సింగర్ డేటింగ్ ?

పాక్ నటితో బాలీవుడ్ స్టార్ సింగర్ డేటింగ్ ?

Hello Telugu - Badshah

Badshah: ప్రముఖ బాలీవుడ్ సింగర్, ర్యాపర్ బాద్ షా కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తుంది. ఒకవైపు సినిమా పాటలు… మరోవైపు ర్యాప్ సాంగ్స్ తో బాలీవుడ్ ను ఊపేస్తున్న ఈ సింగర్… పాక్ నటితో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాకుండా… ఆ వీడియోలు నెట్టింట ప్రత్యక్షం కావడమే దీనికి కారణమట. కొన్నేళ్ల ముందు భార్యతో విడాకులు తీసుకన్న ఈ ర్యాపర్… ప్రస్తుతం పాకిస్తాన్ కు చెందిన నటితో డేటింగ్ లో ఉన్నట్లు గత కొంతకాలంగా రూమర్స్ వస్తున్నాయి. అయితే వీరిద్దరికీ సంబంధించిన వీడియో తాజాగా వైరల్ కావడంతో మరోసారి ఇది హాట్ టాపిక్ అయింది.

Badshah Comment

ఢిల్లీలో పుట్టి పెరిగిన బాద్ షా… ర్యాపర్‌ గా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత సింగర్‌ గానూ బాలీవుడ్‌లో పలు హిట్ సాంగ్స్ పాడాడు. వ్యక్తిగత విషయానికొస్తే జాస్మిన్ మాసీ అనే అమ్మాయితో దాదాపు ఎనిమిదేళ్లు కలిసున్నాడు. వీళ్లకు ఓ పాప కూడా ఉంది. మరి ఏమైందో ఏమో గానీ 2020లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం కెరీర్ పరంగా పర్వాలేదనిపించే బిజీగా బాద్ షా ఉ‍న్నాడు.

అయితే సింగర్ బాద్ షా(Badshah), పాక్ నటి హనియా ఆమిర్‌తో ప్రేమలో ఉన్నాడనే న్యూస్ గతేడాది డిసెంబరులో వైరల్ అయింది. హనియా స్వయంగా తన ఇన్ స్టాలో బాద్ షాతో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేయడంతోనే ఈ రూమర్స్ వచ్చాయి. తాజాగా మరోసారి వీళ్లిద్దరూ దుబాయిలో కలిశారు. ఓ కన్సర్ట్ కోసమేనని చెప్పుకొచ్చారు. కానీ బాద్ షా-హనియా మాత్రం రిలేషన్ లోనే ఉన్నారని, కపుల్ క్యూట్ అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Anee Master: జారిపడ్డ యానీ మాస్టర్‌ ! నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com