నందమూరి బాలకృష్ణ కీలక పాత్రలో నటించిన చిత్రం అఖండ. గతంలో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ ప్లాన్ చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు ఈ చిత్రం ద్వారా. జూన్ 10వ తేదీన బాలయ్య బాబు పుట్టిన రోజు. ఈ సందర్బంగా తన అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు దర్శకుడు. ఏకంగా అఖండ-2 టీజర్ రిలీజ్ చేశాడు. ఊర మాస్ అప్పియరెన్స్ తో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు నందమూరి నట సింహం.
అఖండ 2 యొక్క గ్లింప్స్ విడుదలై యూట్యూబ్‌లో బంపర్ రెస్పాన్స్‌ను పొందింది. విడుదలైన 17 గంటల్లోనే, అఖండ 2 టీజర్ 16 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించగలిగింది. దీనిని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మూవీ మేకర్స్. అందుకు తగ్గట్టుగానే చిత్రీకరించాడు బోయపాటి. హింసను ఓ రేంజ్ లో తెర మీద చూపించాలంటే తన తర్వాతే ఎవరైనా. ఈ గ్లింప్స్ ను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఆదరిస్తుండడం విశేషం.
ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉన్నాడు నందమూరి బాలయ్య. దీనికి కారణం తను బాబ్జీ తీసిన డాకు మహారాజ్ సూపర్ హిట్ అయ్యింది. రూ. 100 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇక కేంద్ర సర్కార్ పద్మ భూషణ్ తో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఇక అఖండ -2 టీజర్ దుమ్ము రేపుతోంది. మొత్తంగా బాలయ్యా మజాకా అంటున్నారు ఫ్యాన్స్.