జాతీయ స్థాయి అవార్డు పొందిన నటుడు , ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమిళ సినిమాలో నటించబోతున్నాడు. స్టార్ హీరో రజనీకాంత్ కీ రోల్ పోషిస్తున్న జైలర్ -2 చిత్రంలో అతిథి పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే అందులో కేవలం 10 నిమిషాల నిడివి కలిగిన పాత్ర అని, దీనికి భారీ ఎత్తున పారితోషకం కూడా ఇచ్చేందుకు రెడీ అయినట్లు టాక్.
ఇది పక్కన పెడితే ఈ ఏడాది నందమూరి బాలయ్యకు శుభసూచకంగా మారింది. కారణం ఏమిటంటే సంక్రాంతి సందర్భంగా మూడు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కాగా అనిల్ తీసిన సంక్రాంతికి వస్తున్నాం. మరోటి నందమూరి నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగానే వసూలు చేసింది. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఆశించిన దానికంటే వసూళ్లు చేయడం విశేషం.
తను ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ మూవీలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత జైలర్ -2 కు సంబంధించి కీలక సన్నివేశంలో బాలయ్య నటించనున్నాడు. మొత్తంగా ఏదో రకంగా తను వార్తల్లో ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఎన్నారైలతో వజ్రోత్సవ సంబురాలలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఇక్కడికి రాగానే షూటింగ్ కు వెళతాడని టాక్.