Jailer 2 : తమిళ సినీ టాప్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సీక్వెల్ చిత్రం జైలర్. ఇప్పటికే ఈ మూవీ పార్ట్ 1 రికార్డ్ బ్రేక్ చేసింది. దేశ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించింది. సన్ పిక్చర్స్ దీనిని నిర్మించింది. బిగ్ సక్సెస్ తో సీక్వెల్ కు ప్లాన్ చేసింది. తొలి పార్ట్ లో స్టార్ హీరోస్ పాలు పంచుకున్నారు. తాజాగా రెండో ప్రాజెక్టులో కీలక అప్ డేట్ వచ్చింది మూవీకి సంబంధించి. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, బుల్లి తెరపై హోస్ట్ గా, నటుడిగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. తను తాజాగా నటించిన డాకు మహారాజ్ సూపర్ హిట్ అయ్యింది. రూ. 130 కోట్లు వసూలు చేసింది.
Balakrishna Key Role in Thalaiva Jailer 2 Movie
జైలర్ 2(Jailer 2) కి సంబంధించి ఓ వార్త టాలీవుడ్ , కోలీవుడ్ లో గుప్పుమంటోంది. నందమూరి బాలకృష్ణ ఇందులో కీ రోల్ పోషించనున్నాడని కన్ ఫర్మ్ చేశాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. రజనీకాంత్ తో పాటు అతిథి పాత్రలో నటించనున్నాడని పేర్కొన్నాడు. ఈ విషయం దక్షిణ భారత దేశ సినీ రంగాన్ని షేక్ చేసింది. ప్రస్తుతం నందమూరి బాలయ్య బాబు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సీక్వెల్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. జార్జియాలో కొనసాగుతోంది.
గత కొంత కాలం నుంచీ బాలయ్య జైలర్ 2 లో నటించడం పక్కా అని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ సమయంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చర్చలు జరిపాడని, అందుకు నటుడు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గతంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ మూవీలో గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు. మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.
Also Read : Spirit – Sandeep Reddy Vanga:స్పిరిట్ ప్రాజెక్టుపై సందీప్ రెడ్డి ఫోకస్