ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను తన తండ్రి పేరు మీద దివంగత నందమూరి తారక రామారావు పేరు మీద ఏర్పాటు చేసిన ఫిలిం అవార్డును తొలిసారిగా తనను ఏరికోరి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు స్వయంగా లేఖ రాశారు. తన జీవితంలో మరిచి పోలేని రోజుగా ఇది మిగిలి పోతుందన్నాడు. ఈ ఏడాది తనకు కలిసి వచ్చిందని, ప్రత్యేకించి సినిమా పరంగా, అవార్డుల పరంగా తనకు అత్యంత ఆనందం కలిగించిందని పేర్కొన్నాడు నందబూరి బాలకృష్ణ.
మోదీ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో తనను గౌరవించింది. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ గద్దర్ ఫిలిం అవార్డులను 2014 నుంచి 2023 వరకు ప్రకటించింది. మొత్తం 30 సినిమాలను ఎంపిక చేసింది. వీటితో పాటు సినిమా రంగానికి విశిష్ట సేవలు అందించిన దివంగత ప్రముఖుల పేరు మీద పురస్కారాల కోసం ఎంపిక చేసింది.
వీరిలో ఎన్టీఆర్ ఫిలిం అవార్డును నందమూరి బాలకృష్ణను ఎంపిక చేయగా, రఘుపతి వెంకయ్య ఫిలిం పురస్కారాన్ని ప్రముఖ రచయిత యుండమూరి వీరేంద్ర నాథ్ ను, పైడి జయరాజ్ ఫిలిం అవార్డును విజయ్ దేవరకొండకు, బీఎన్ రెడ్డి పురస్కారాన్ని దర్శకుడు సుకుమార్ కు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును అట్లూరి వేంకటేశ్వర రావును ఎంపిక చేసింది. ఈ సందర్బంగా తనకు అవార్డును ప్రకటించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ప్రత్యేకించి జ్యూరీకి, సీఎం ఎ. రేవంత్ రెడ్డికి ధన్వవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు నందమూరి బాలకృష్ణ.