హైదరాబాద్ – ఏపీ సర్కార్ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు చట్ట విరుద్దమని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డీపీఆర్ ను ఎలా ఆమోదిస్తారంటూ ప్రశ్నించారు. తాము కచ్చితంగా అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. ఇందులో భాగంగా గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపడానికి తమ ప్రభుత్వం చట్ట పరమైన చర్యలతో ముందుకు సాగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందన్నారు.
ఇదిలా ఉండగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించిందన్నారు. ఈ ప్రాజెక్టును చేపట్టడం వల్ల ఎలాంటి నష్టం తెలంగాణ ప్రాంతానికి జరగదన్నారు. తనకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
గోదావరి, కృష్ణా నదీ జలాలు సముద్రంలో 3000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయని, అందుకే తాము బనకచర్లకు నీటిని తరలించు పోయేందుకు ప్లాన్ చేశామన్నారు. రెండు రాష్ట్రాలు లాభ పడతాయని, ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ చిలుక పలుకులు పలికారు. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఏపీకి లాభం చేకూర్చేలా మాట్లాడటం పట్ల తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు.
