Ajit Agarkar : ప్రపంచ క్రికెట్ లో అత్యధిక ఆదాయం కలిగిన బీసీసీఐకి ఇప్పుడు టీమిండియా టెస్టు కెప్టెన్ ను ఎంపిక చేయడం తలనొప్పిగా మారింది. ఎవరికి పగ్గాలు ఇస్తే జట్టు గాడిలో పడుతుందోనని చర్చోప చర్చలు జరుపుతోంది. త్వరలోనే బీసీసీఐ సెలెక్టర్ చైర్మన్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) కీలక సమావేశం కానున్నారు. ముంబై వేదికగా జరిగే ఈ కీలక భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తరుణంలో పలువురు ఆటగాళ్లను పరిశీలించనున్నారు సెలెక్షన్ కమిటీ.
Ajit Agarkar…
ప్రధానంగా టెస్టు జట్టు స్కిప్పర్ రేసులో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, జస్ ప్రీత్ బుమ్రా పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ఆల్ రౌండర్ గా పేరు పొందిన ముంబైకి చెందిన ముంబై ఇండియన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యాను పరిగణలోకి తీసుకోక తప్పదని క్రికెట్ వర్గాల భోగట్టా. తను బ్యాటింగ్ చేయగలడు. అవసరమైన సమయంలో బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించగలడు.
ముంబై ఇండియన్స్ కు విజయాలను చేకూర్చి పెట్టిన పాండ్యానే సరైన ఛాయిస్ టీమిండియా స్కిప్పర్ పోస్ట్ కు అని ప్రచారం జరుగుతోంది. అయితే సెలెక్టర్లతో పాటు హెడ్ కోచ్ గంభీర్ మదిలో ఎవరు ఉన్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే పాండ్యా లేదంటే శ్రేయాస్ అయ్యర్ లలో ఎవరో ఒకరికి సారథ్య పగ్గాలు అప్పగించనున్నారు .
Also Read : Rishabh Pant Best Choice :మిస్టర్ కూల్ రిషబ్ పంత్ బెస్ట్ ఛాయిస్