Bhagwant Kesari Update : భ‌గ‌వంత్ కేసరి అప్ డేట్

4న మూవీ సెకండ్ సాంగ్

టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రు అనిల్ రావిపూడి. పంచ్ లు, ప్రాస‌ల‌తో పాటు కామెడీ కూడా పండించ‌గ‌ల‌డు. ఆయ‌న తీసిన వాటిలో ఎఫ్2 సూప‌ర్ డూప‌ర్ హిట్. ప్రిన్స్ మ‌హేష్ బాబుతో తీసిన చిత్రం అద్భుత విజ‌యాన్ని సాధించింది. త‌క్కువ కాలంలో మంచి ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందాడు.

మ‌నోడి టైమింగ్ , టాలెంట్ న‌చ్చ‌డంతో నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య బాబు అనిల్ రావిపూడి క‌థ‌కు ఓకే చెప్పేశాడు. త‌న మేన‌రిజంకు త‌గ్గట్టుగా భ‌గ‌వంత్ కేస‌రి అని సినిమాకు పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్స్, సాంగ్ ఇప్ప‌టికే బాల‌య్య ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేలా చేశాయి.

ఇందులో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు న‌టిస్తున్నారు. ఒక‌రేమో కాజ‌ల్ అగ‌ర్వాల్ కాగా మ‌రొక‌రు ల‌వ్లీ గ‌ర్ల్ శ్రీ‌లీల‌. తాజాగా మూవీకి సంబంధించి మూవీ మేక‌ర్స్ కీల‌క అప్ డేట్ ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 4న సినిమాకు సంబంధించి సాంగ్ రిలీజ్ చేస్తున్న‌ట్టు టాక్.

ఏది ఏమైనా ప్ర‌స్తుతం బాల‌య్య పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. త‌న బావ ప్ర‌స్తుతం జైలు పాల‌య్యారు. అల్లుడు అరెస్ట్ చేస్తార‌ని ఢిల్లీలో మ‌కాం వేశాడు. మొత్తంగా మూవీ ప్ర‌మోష‌న్స్ కు వ‌స్తారా లేదా అన్న‌ది తేలాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com