Bhagyashri Borse : టాలీవుడ్ లోనే కాదు ఇతర సినీ పరిశ్రమలలో నిలదొక్కు కోవాలంటే చాలా కష్ట పడాల్సి ఉంటుంది నటీ నటులు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే తళుక్కున మెరుస్తున్నారు. ఒకటి రెండు సినిమాలలో అలా నటించి ఇలా మెస్మరైజ్ చేసేసి ..ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇప్పటికే ఇలాంటి వారిలో చాలా మంది నటీమణులు ఉన్నారు. ఉప్పెన ఫేమ్ కృతీ శెట్టి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బోర్లా పడింది. ఇక శ్రీలీల సంగతి చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలతో నటించినా ఎందుకనో వర్కవుట్ కావడం లేదు. చివరకు స్పెషల్ సాంగ్ కు పరిమితమయ్యేలా ఉంది.
Bhagyashri Borse Movie with Vijay Deverakonda
సుకుమార్ తీసిన పుష్పలో కిస్సక్ అంటూ కవ్వించింది. మరోసారి రామ్ చరణ్ నటిస్తున్న పెద్దిలో మెరవనుంది. ఇక తన చేతుల్లో సినిమాలు లేవు కొత్తవి. నితిన్ రెడ్డితో నటించిన రాబిన్ హుడ్ బోర్లా పడింది. తన పాదం బాగో లేదన్న అపవాదు మూటగట్టుకున్నాడు హీరో. అయినా తనకు ఛాన్స్ లు వస్తుండడం విశేషం. ఇక తాజాగా మరో హీరోయిన్ గురించి చెప్పుకోవాలి. బాలీవుడ్ నుంచి వచ్చింది భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ లో కీ రోల్ పోషించింది.
హీరోగా మాస్ మహారాజా రవితేజ నటించాడు. కానీ ఈ సినిమా ఆశించిన మేర ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే భాగ్యశ్రీ బోర్సేకు వరుసగా సినిమాలలో ఛాన్స్ లు లభిస్తున్నాయి. తను తాజాగా కీ రోల్ పోషించిన చిత్రం కింగ్ డమ్. ఇందులో స్క్రీన్ పంచుకుంది విజయ్ దేవరకొండతో. ఆ తర్వా దిల్ రాజు నిర్మించబోయే కొత్త మూవీ రౌడీ జనార్దన్ చిత్రంలో బుక్ అయ్యింది. మరో వైపు రామ్ పోతినేనితో షూటింగ్ లో బిజీగా ఉంది. తను కింగ్ డమ్ పై భారీగా ఆశలు పెట్టుకుంది. మరి ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
Also Read : Hero Ranbir-Sai Pallavi Ramayan :దీపావళికి రానున్న రామాయణం
