Bhairavam : తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది గరుడన్ చిత్రం. దీనిని రీమేక్ తీశారు తెలుగులో భైరవం పేరుతో. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ కెవ్వుకేక అనిపించేలా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించి సాంగ్ ను విడుదల చేశారు. ఇది పూర్తిగా స్నేహం విలువ ఏమిటో చెప్పేలా ఉంది. దీనిని గేయ రచయిత అద్భుతంగా రాయడం విశేషం.
Bhairavam Movie Song Updates
ఇక తెలుగులో విజయ్ కనకమేడల తీస్తున్నాడు. భైరవం(Bhairavam) చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదలైన సాంగ్ ముగ్గురు స్నేహితుల మధ్య వచ్చే సాంగ్ కావడం , మంచి ఫీల్ గుడ్ కలిగించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సాహిత్యం కూడా బాగుంది. ప్రధానంగా పాటలో రాముడు, లక్ష్మణడు, ఆంజనేయుడు పాత్రలు ఉండేలా తీసినట్లు కనిపిస్తోంది.
మంచు మనోజ్ శ్రీరాముడైతే, ఆయన సోదరుడు లక్ష్మణుడి పాత్రలో రోహిత్ ఉంటాడని, వీరందరిని కనిపెట్టుకుని , కంటికి రెప్పలా కాపాడే ఆంజనేయ స్వామి పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇమిడి పోవడం మరింత ఆసక్తిని రేపేలా చేసింది. ఈ చిత్రంలో వీరితో పాటు ఆనంది, దివ్యా పిళ్లై, జయసుధ కీ రోల్స్ పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా ప్రముఖ గేయ రచయిత భాస్కర భట్ల పాటను రాశడు. సాహితి చాగంటి, సౌజన్య ఆలాపించారు. ఈనెల 30న రిలీజ్ కానుంది.
Also Read : Beauty Janhvi Kapoor-Peddi :పెద్ది షూటింగ్ లో జాన్వీ కపూర్ బిజీ