టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు బుచ్చిబాబు సన. తను తీసిన ఉప్పెన సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తను తీసే పద్దతి కొంచెం భిన్నంగా ఉంటుంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో కథలను తయారు చేసుకుంటాడు. తాను అనుకునే సీన్స్ వచ్చేంత వరకు నిద్ర పోడు. ఇది తన నేపథ్యం. తాజాగా తను చర్చనీయాంశంగా మారాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి పెద్ది మూవీ తీస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ , కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక రోల్స్ పోషిస్తున్నారు.
ఈ సందర్బంగా ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్, గ్లింప్స్ కు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సందర్బంగా షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఇప్పటికే తన పెద్ది మూవీకి సంబంధించి కీలక ప్రకటన చేశాడు బుచ్చిబాబు సన. రిలీజ్ డేట్ కూడా వెల్లడించాడు. ఈ సినిమాపై భారీగా నమ్మకం పెట్టుకున్నాడు రామ్ చరణ్.
తనకు ఈ ఏడాది ప్రారంభం షాక్ ఇచ్చిందని చెప్పక తప్పదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ బొక్క బోర్లా పడింది. స్టార్ ఇమేజ్ ఏ మాత్రం కాపాడలేక పోయింది. దీంతో చెర్రీ పూర్తిగా పెద్దిపై ఆధారపడ్డాడు. ఈ తరుణంలో చిట్ చాట్ సందర్బంగా బుచ్చిబాబు సన కీలక వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాలన్నీ గ్రామీణ నేపథ్యంతో ఉంటాయని స్పష్టం చేశాడు. ఆ వాతావరణం అంటేనే తనకు ఇష్టమన్నాడు.
