ఒకే ఒక్క సినిమాతో తన స్టామినా ఏమిటో చూపించాడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే 30 శాతానికి పైగా సినిమా షూటింగ్ అయి పోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ సెట్టింగ్స్ వేశాడు. వేసవి విడిది తర్వాత వచ్చిన రామ్ చరణ్ బిజీగా మారి పోయాడు. ఇందులో లవ్లీ బ్యూటీ దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయకిగా నటిస్తోంది. ఆయనతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ , భారత జట్టు మాజీ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇతర పాత్రల్లో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సందర్బంగా బుచ్చిబాబు సన కీలక వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాలన్నీ గ్రామీణ నేపథ్యంతో ఉంటాయని చెప్పాడు. ఇందులో ఎలాంటి భేషజాలు లేవన్నాడు. ఎందుకంటే తనకు ఆ వాతావరణం అంటే నచ్చుతుందని చెప్పాడు. తను సుకుమార్ స్కూల్ నుంచి వచ్చాడు. తనంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. ఇదే సమయంలో ఎందుకు పెద్ది మూవీలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ ను తీసుకున్నారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు దర్శకుడు.
తనకు క్రేజీ హీరోయిన్స్ అంటే ఇష్టమన్నాడు. వారిలో నేర్చుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుందన్నాడు. అందుకే తాను జాన్వీని సెలెక్షన్ చేశానని చెప్పాడు. పెద్ది కూడా పూర్తిగా గ్రామీణ క్రీడా నేపథ్యంతో ఉంటుందని చెప్పాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పెద్ది గ్లింప్స్ ఓ రేంజ్ లో ఆదరణకు నోచుకుంది. తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.