Bujji and Bhairava: ‘కల్కి 2898ఏడీ’ కు సంబంధించి బుజ్జి అండ్‌ భైరవ యానిమేషన్ ట్రైలర్‌ విడుదల !

‘కల్కి 2898ఏడీ’ కు సంబంధించి బుజ్జి అండ్‌ భైరవ యానిమేషన్ ట్రైలర్‌ విడుదల !

Hello Telugu - Bujji and Bhairava

Bujji and Bhairava: వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 AD’. ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Bujji and Bhairava Updates..

జూన్‌ 27న విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాకు సంబంధించి భైరవ పాత్రలో హీరో ప్రభాస్ ఉపయోగించిన బుజ్జి (వాహనం) ను పరిచయం చేస్తూ ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్… సినిమాలో బుజ్జి పాత్రకు సంబంధించిన ప్రత్యేక వాహనాన్ని నడుపుకుంటూ వేదిక మధ్యలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు. ప్రస్తుతం ప్రభాస్ ఎంట్రీతో పాటు బుజ్జి వాహనం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ బుజ్జికి హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ వాయిస్‌ అందించింది. ఈ బుజ్జి వాహనం దేశమంతా చుట్టు ముడుతూ సినిమాపైన విపరీతమైన హైప్ ను పెంచింది.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ నటించిన పాత్ర పేరు భైరవ. ఇప్పటికే భైరవ పాత్రకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ బుజ్జి, భైరవ(Bujji and Bhairava) కలిసి చేసే సాహసాలకు సంబంధించి ఓ యానిమేటెడ్ సిరీస్ ను తీసుకువస్తుంది. దీనితో బుజ్జి అండ్‌ భైరవ యానిమేషన్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 31వ తేదీ నుంచి తెలుగు, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ క్రమంలో బుజ్జి అండ్‌ భైరవ యానిమేషన్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ లో బుజ్జి, భైరవలు అదరగొట్టేశారు. వీరిద్దరి మధ్య దోస్తీ ఎలా కుదిరిందో ఈ సిరీస్‌లో చూపించనున్నారు. సంతోష్‌ నారాయణన్‌ అందించిన సంగీతం అయితే సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా మారనున్నట్లు కనిపిస్తోంది.

Also Read : Suryadevara Naga Vamsi: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com