నేషనల్ క్రష్ గా మారి పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావ్య మారన్. తను ఆసియా ఖండంలోనే అత్యంత జనాదరణ పొందిన మీడియా సంస్థ సన్ నెట్ వర్క్ కు వారసురాలు. ప్రస్తుతం చర్చల్లోకి వచ్చింది అందాల సుందరి. ఐపీఎల్ లో మోస్ట్ పాపులర్ గర్ల్ . తనకు ఇంకా పెళ్లి కాలేదు. వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. ఇప్పుడు తను ఎవరిని పెళ్లి చేసుకుంటుందోనన్న ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేసింది. తన ఆస్తులు లెక్కించాలంటే ఒక ఏడాది పడుతుందట. అంతలా ఉన్నాయన్నమాట.
ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థ పేర్కొంది. తన తండ్రి ఎవరో కాదు దివంగత మాజీ సీఎం కరుణానిధి వారసత్వానికి ప్రతినిధిగా ఉన్న కళానిధి మారన్ స్వయంగా కన్న కూతురే ఈ సుందరి కావ్య మారన్. తను గత ఏడాది కాలం నుంచే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తో ప్రేమలో పడింది. ఇక తను పుట్టింది చెన్నైలో. ఎంబీఏ చేసింది. తన తాత ప్రముఖ వ్యాపారి. కేంద్ర మాజీ మంత్రి. మురసోలి మారన్. వ్యాపారానికి, రాజకీయాలకు పెట్టింది పేరు. తండ్రి కళానిధికి స్వయాన తాత సీఎం కరుణానిధి. విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు పొందాడు. అదే సన్ నెట్ వర్క్, సన్ పిక్చర్స్. మార్కెట్ అంచనాల ప్రకారం రూ. 20 వేల కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ఇదే కుటుంబానికి చెందిన దయానిధి మారన్ డీఎంకే ఎంపీగా ఉన్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ జట్టుకు తన తండ్రితో పాటు సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు కావ్య మారన్. వారసురాలిగా మాత్రమే కాకుండా తనంతట తానుగా ఒక బలీయమైన శక్తిగా వెలుగులోకి వచ్చింది. 2018లో, ఆమె సన్రైజర్స్ హైదరాబాద్ సిఇఒ పాత్రను చేపట్టింది, ఇది ఆమె అభివృద్ధి చెందుతున్న కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. క్రికెట్కు మించి, కావ్య ప్రభావం మీడియా రంగానికి విస్తరించింది, సన్ టివి నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తోంది, అక్కడ ఆమె దాని సంగీతం, రేడియో ఛానెల్లను పర్యవేక్షిస్తుంది.