కరీంనగర్ జిల్లా – కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరస్వతి పుష్కరాల సందర్బంగా తనకు జరిగిన అవమానం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ దేశంలో డబ్బులు ఉండడం, లెక్కలేనంత సంపద పోగు చేసుకోవడం కంటే పేరు పొందిన కులంలో పుడితే చాలా ప్రయోజనాలు దక్కుతాయని తాను తెలుసుకున్నానని చెప్పారు.
విచిత్రం ఏమిటంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సరస్వతి పుష్కరాలను ప్రారంభించింది. ఈ సందర్బంగా కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు , తన భార్య దేవాదాయ శాఖ కమిషనర్ తో కలిసి పుష్కరాలలో మునిగారు. తనే ఓ స్వామీజీతో కలిసి ప్రారంభించారు. ఇదే నియోజకవర్గానికి చెందిన దళిత సామాజిక కులానికి చెందిన వంశీ ఎంపీగా ఉన్నారు. కనీసం తనను ఆహ్వానించలేదు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎంపీ అనుచరులు.
పోలీసులు వారిని అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్బంగా ఇవాళ చివరి రోజు పుష్కరాలు. ఈ సందర్బంగా పుష్కరాలలో పుణ్య స్నానం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు వంశీ. డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నానని, కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశానంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనను ఆహ్వానించక పోవడం పట్ల బాధకు గురైనట్లు వాపోయాడు.
భారత రాజ్యాంగం ప్రకారం కులాలతో సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలను వెళ్లొచ్చని మరొకసారి గుర్తు చేస్తున్నట్లు ప్రకటించారు గడ్డం వంశీ.
