Chiranjeevi : ఏ రంగంలోనైనా రాణించాలంటే కష్టపడాలి. నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ సినిమా మీద ఉన్న ప్రేమను చంపుకోలేక పోయా. ఎందుకంటే ఊరులో ఉన్నప్పుడు సినిమాలు చూస్తూ పెరిగా. ఏదో ఒక రోజు నన్ను నేను తెరపై చూసుకోవాలని అనుకున్నా. ఆ దిశగా అడుగులు వేశా. మా ఊరు నుంచి పెట్టె సర్దుకుని చెన్నైకి రైలు ఎక్కా. తమిళనాడులో అప్పటికే ఎందరో సినీ రంగాన్ని రాజ్యం ఏలుతున్నారు. ఆ సమయంలో నేనేమిటి..ఇక్కడికి రావడం ఏమిటి అని అనుకున్నా. చివరకు నా కల ఫలించింది.
Chiranjeevi Comments
ప్రతి రంగంలో రాణించిన వారు కొందరు ఉంటారు. వారిపై ఎవరో ఒకరి ప్రభావం తప్పకుండా ఉండి ఉంటుందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ముంబై వేదికగా ప్రధాని ప్రారంభించిన వేవ్స్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా తనపై కూడా ఎందరో ప్రభావం ఉందని అన్నారు. అయితే తనను ఎక్కువగా మెస్మరైజ్ చేసింది మాత్రం ముగ్గురేనని చెప్పారు. వారిలో ఒకరు బాలీవుడ్ కు చెందిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ , ఇంకొకరు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి నటుడిగా స్థిర పడిన మిథున్ చక్రవర్తి, ఇక అసమాన ప్రతిభా నైపుణ్యం కలిగిన కమల్ హాసన్ తనను ఎక్కువగా ప్రభావం చూపించారని వెల్లడించారు.
ఆ తర్వాత నేను మనవూరి పాండవులులో నటించాను. ఆ సినిమా నా కెరీర్ కు మంచి ఊపు ఇచ్చేలా చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చా. జీవితంలో ఈ స్థాయికి రావడానికి ఎందరో నాకు తోడ్పాటు అందించారు. అందులో కుటుంబం కూడా. మా అమ్మ, నాన్న , సోదరులు , భార్య , పిల్లలు వీళ్లు లేక పోతే నేను లేను. అందరికీ ధన్యవాదాలు..ప్రత్యేకించి తనను ఆహ్వానించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : Taapsee Pannu Shocking :ఇన్‌ఫ్లూయెన్సర్ సూసైడ్ తాప్సీ కామెంట్స్
