Hero Chiranjeevi Movie :మెగాతో మూవీ ఫిక్స్ వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్

క‌న్ ఫ‌ర్మ్ చేసిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి

Chiranjeevi : టాలీవుడ్ లో టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). త‌న పేరుతోనే సినిమాలు న‌డుస్తాయి. త‌న ఇమేజ్ ఆకాశ‌మంత. త‌న‌తో సినిమా తీయాలంటే ద‌మ్ముండాలి. అంత‌కు మించి త‌న‌తో న‌ట‌న‌ను తీసుకునే వారై ఉండాలి. త‌ను ద‌ర్శ‌కుల‌కు కావాల్సిన న‌టుడు. ఆయ‌న‌తో చిత్రం తీసేందుకు ప్ర‌తి ఒక్క ద‌ర్శ‌కుడు త‌మ క‌ల‌ల డ్రీమ్ గా పేర్కొంటారు. ఏ పాత్ర ఇచ్చినా స‌రే దానికి న్యాయం చేసేందుకు ఎల్ల‌ప్పుడూ సిద్దంగా ఉంటాడు చిరంజీవి. ప్ర‌స్తుతం త‌ను విశ్వంభ‌ర మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం షూటింగ్ ఆఖ‌రి స్టేజిలో ఉంది.

Chiranjeevi-Anil Ravipudi Movie Updates

ఇదే స‌మ‌యంలో నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనే క్వ‌చ్చ‌న్ కు త‌నే స‌మాధానం ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. మినిమం గ్యారెంటీ క‌లిగిన ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో మూవీ ఉంటుంద‌ని క‌న్ ఫ‌ర్మ్ చేశాడు. ఇది పూర్తిగా యాక్ష‌న్ , కామెడీ, సస్పెన్స్ తో ఉంటుంద‌ని తెలిపాడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది బ్లాక్ బ‌స్టర్ మూవీ తీశాడు. విక్ట‌రీ వెంక‌టేశ్ తో హ్యాట్రిక్ కొట్టాడు. ఎఫ్ 1, ఎఫ్ 2 తాజాగా సంక్రాంతికి వ‌స్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా రిలీజ్ అయిన ఈ చిత్రం అంచ‌నాలు మించి క‌లెక్ష‌న్స్ సాధించింది.

భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. స్కిప్ట్ కూడా సిద్ద‌మైంద‌ని, చిరంజీవిని గ‌తంలో చూడ‌ని పాత్ర‌లో చూపించనున్నాడు అనిల్ రావిపూడి. పూర్తిగా వినోదాత్మ‌కంగా కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకు వెంట‌నే మెగాస్టార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఇందులో చిరంజీవి పూర్తి పేరు శివ శంక‌ర్ ప్ర‌సాద్ పేరుతో న‌టించ‌నున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్.

Also Read : Rashmika Sensational :గాయంపై ర‌ష్మిక మంద‌న్న కామెంట్స్ 

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com