Hero Chiranjeevi-Jakkanna :జ‌క్క‌న్న‌తో మూవీ చేయాలంటే టైం కావాలి

న‌న్ను నేను నిరూపించు కోవాల్సిన ప‌ని లేదు

Chiranjeevi :టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. యంగ్ హీరోస్ వ‌స్తున్నా త‌న‌తో ఎవ‌రూ పోటీ ప‌డే స్థాయికి చేర‌డం లేదు. ఇప్ప‌టికీ త‌న స్థానం ప‌దిలంగానే ఉంది. ఆచి తూచి అడుఉలు వేస్తున్నారు. ప్ర‌స్తుతం వశిష్ట‌తో విశ్వంభ‌ర లో న‌టిస్తున్నాడు. ఇది దాదాపు పూర్తి కావ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో అనిల్ రావిపూడితో కొత్త మూవీ స్టార్ట్ చేశాడు. ఈ సంద‌ర్బంగా చిట్ చాట్ లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి గురించి.

Chiranjeevi Comment about Movie with Rajamouli

జాతీయ స్థాయిలో త‌న స్థామినా ఏమిటో నిరూపించు కోవాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). తాను ఒక ఏడాదిలో రెండు లేదా మూడు సినిమాలు తీయ‌గ‌ల‌ను. కానీ అదే రాజ‌మౌళితో అయితే ఏళ్ల త‌ర‌బ‌డి తాను ప్యాక‌ప్ కావాల్సి ఉంటుంద‌న్నాడు. త‌న‌కు ఇచ్చే స‌మ‌యంలో తాను నాలుగు లేదా ఐదారు సినిమాలు చేయ‌గ‌ల‌న‌ని స్ప‌ష్టం చేశాడు మెగాస్టార్ చిరంజీవి.

ప్యాన్ ఇండియా స్థాయిలో త‌న‌ను తాను నిరూపించు కునేందుకు జ‌క్క‌న్న‌తో క‌లిసి ప‌ని చేయాల‌నే భావ‌న‌ను ఆయ‌న తోసి పుచ్చారు. రాజ‌మౌళి ప్ర‌తిభా నైపుణ్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. మంచి సినిమాలు తీశాడు. రాజ‌మౌళికి ఎక్కువ స‌మ‌యం కేటాయించాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌న‌కు వ‌ర్క‌వుట్ కాద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశాడు మెగాస్టార్. విచిత్రం ఏమిటంటే త‌న కుమారుడు రామ్ చ‌ర‌ణ్ జ‌క్క‌న్న‌తో మ‌గ‌ధీర‌, ఆర్ఆర్ఆర్ మూవీస్ లో చేశాడు. ఆ రెండు బిగ్ స‌క్సెస్ గా నిలిచాయి.

Also Read : Balakrishna- Big Boss-9 :బిగ్ బాస్ తెలుగు 9కి బాలకృష్ణ హోస్ట్ ..?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com