మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం మెగా 157. దీనికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. మెగాస్టార్ సినీ కెరీర్ లో ఇది మైలురాయిగా నిలిచి పోతుందని ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తను ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఆ సినిమాను ఓ రేంజ్ లోకి తీసుకు వెళ్లడంలో తనకు తనే సాటి. గతంలో తీసిన ప్రతి మూవీ బిగ్ హిట్ .
ప్రధానంగా విక్టరీ వెంకటేశ్ తో హ్యాట్రిక్ మూవీస్ తో సక్సెస్ కొట్టాడు. ఏకంగా వెంకీ మామ సినీ చరిత్రలో బ్లాక్ బస్టర్ గా నిలిచేలా చేశాడు. దీంతో మార్కెట్ లో మనోడికి బిగ్ డిమాండ్ ఏర్పడింది. మరో వైపు మారుతి కూడా తన సత్తా ఏమిటో చూపించేందుకు రెడీ అయ్యాడు. డార్లింగ్ ప్రభాస్ తో రాజా సాబ్ తీస్తున్నాడు. అది కూడా ఆఖరు దశలో ఉంది. ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, తమిళ లేడీ అమితాబ్ గా పేరు పొందిన నయనతారతో కలిపి సినిమా ప్రకటించాడు. ఆ వెంటనే రంగంలోకి దిగాడు. షూటింగ్ కూడా ప్రారంభించాడు. చిరంజీవి, నయన్ బిగ్ స్టార్స్.
ఇందుకు సంబంధించి కీలక అప్ డేట్స్ ఇచ్చాడు. తను జీవితంలో ఒక్కసారైనా చిరంజీవితో సినిమా చేయాలని ఉండేదని, ఆ కల నేటితో తీరి పోయిందన్నాడు. ఈ సినిమాను వీర లెవల్లో తీసేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. అంతే కాదు దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తాను తీసిన సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చేలా, బ్లాక్ బస్టర్ అయ్యేలా మెగాస్టార్ తో తీస్తానని సంచలన ప్రకటన చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మొత్తంగా మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ రైట్స్ దక్కించు కునేందుకు ఇప్పటి నుంచే పోటీ మొదలైంది.
