బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పై సంచలన కామెంట్స్ చేశాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్. తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుందని అనుకున్నానని, కానీ ఒక్క మాట కూడా చెప్పక పోవడం తనను బాధ కలిగించిందని చెప్పాడు. ఈ మధ్యన తను చిట్ చాట్ సందర్బంగా స్పందించాడు. జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం దేవర. దీనిని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ పాన్ ఇండియా లెవల్లో తీశాడు. ఈ మూవీ ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది.
ఆ తర్వాత దేవర మూవీలో చేసిన పాటలకు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశాడు బోస్కో మార్టిస్. ఈ దేవర మూవీకి సంబంధించిన పాట చుట్టమల్లే సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో రికార్డ్ బ్రేక్ చేసింది. సినిమా విడుదలైనా ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ పాటకు అద్భుతమైన స్టెప్పులు అందించాడు కొరియోగ్రాఫర్. ఈ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. జేజేలు కొట్టారు. కాసుల వర్షం కురిపించింది.
దేవర మూవీ సాంగ్స్ అన్నీ బిగ్ హిట్ అయ్యాయి. థియేటర్లలో అభిమానులు కేరింతలు కొట్టారు. స్లో మూవ్ మెంట్స్ తో పాటు స్టెప్స్ కు ఆదరణ లభించింది. ఈ సందర్బంగా తనకు అంతగా పేరు తీసుకు వచ్చేలా చేసిన తన గురించి ఒక్క మాట కూడా జాన్వీ కపూర్ చెప్పక పోవడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు బోస్కో మార్టిస్. సినిమా ప్రమోషన్స్ సమయంలో తనను పూర్తిగా పక్కన పెట్టేశారంటూ వాపోయాడు. ఇదే సమయంలో విక్కీ కౌశల్ ను ప్రశంసించాడు. తను నటించిన బ్యాడ్ న్యూస్ మూవీలో తాను చేసిన సాంగ్ తౌబా తౌబా పాపులర్ అయ్యింది. బోస్కో మార్టిస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.