హైదరాబాద్ – ఉపాసన కొణిదల సంచలనంగా మారారు. తను ఇవాళ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీనికి కారణం తన గారాల ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి హైదరాబాద్ లోని జూ పార్కుకు వెళ్లారు. అక్కడ కొంత సేపు సేద తీరారు. ఆనందంగా గడిపారు. జూలోని తెల్ల ఆడపులికి తమ కూతురు క్లీంకార పేరు పెట్టారు. ఈ సందర్బంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ఆమె జూ పార్కు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా ఉపాసన కొణిదల ఎవరో కాదు మెగాస్టార్ ఫ్యామిలీ కోడలు. తన తాత ఫేమస్ వ్యాపారవేత్త. అపోలో ఆస్పత్రుల యాజమాన్యం వీరిదే. తను కూడా బిజినెస్ ఉమెన్ గా పేరు పొందారు. ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో నటుడు రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్నారు. తను ఆరోగ్యం పరంగా ఎక్కువగా ప్రచారం చేస్తుంటుంది. ఇదే సమయంలో ఈ ఇద్దరు కూతురుకు జన్మనిచ్చారు.
ఆమెకు క్లీంకార అని విచిత్రమైన పేరు పెట్టారు. ఇది కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. ప్రస్తుతం రామ్ చరణ్ తేజకు ఈ ఏడాది ఆరంభంలో కలిసి రాలేదు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు రూ. 500 కోట్లు పెట్టి తీసిన గేమ్ ఛేంజర్ బోర్లా పడింది. ఆశించిన మేర ఆడలేదు. జనం పక్కన పెట్టేశారు. అంతకు ముందు ఆర్ఆర్ఆర్ వర్కవుట్ అయ్యింది. కానీ చెర్రీ స్టార్ ఇమేజ్ అంతగా పని చేయలేదు. ఈ సినిమాకు పోటీగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది ఒక రకంగా దిల్ రాజుకు ఊరటను కలిగించింది. రామ్ చరణ్ ను నమ్మి సినిమా తీస్తే బొక్క బోర్లా పడేలా చేసిందంటూ వాపోయాడు దిల్ రాజు.
