TDP Mahanadu : అమరావతి – తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కడప జిల్లాలో మహానాడు(TDP Mahanadu) నిర్వహించ బోతున్నామని అన్నారు సీఎం , పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu). మహానాడు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించాలని, ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోవాలని స్పష్టం చేశారు. రాయలసీమను అభివృద్ది చేసే సత్తా ఒక్క టీడీపీ, కూటమి సర్కార్ కే ఉందన్నారు. గత సర్కార్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందంటూ ఆరోపించారు. మనం కొలువు తీరాక చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకు వెళ్లాలని సూచించారు.
TDP Mahanadu Sensational in Kadapa
ఫ్యాక్ష న్ పై అత్యంత కఠినంగా వ్యవహరించాం కాబట్టే నేడు సీమ నుంచి ఫ్యాక్షన్ ను పూర్తిగా తరిమేశాం అని సిఎం అన్నారు. ఇలాంటి చారిత్రాత్మక చర్యలు ప్రజల గుండెల్లో ఉన్నాయని గుర్తు చేశారు. సీమకు సాగునీరు ఇవ్వడం ద్వారా అక్కడి స్థితిగతులు మార్చాలని మొదట ఎన్టీఆర్ సంకల్పం చేశారన్నారు. హంద్రీనీవా, గాలేరు – నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవే అని సిఎం గుర్తు చేశారు. ఎడారిగా మారుతున్న అనంతపురం జిల్లాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి తాగు, సాగు నీరిచ్చిన ఘనత టీడీపీదని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సీమలో కరువుకు సమాధానం చెప్పామని..నేడు డ్రిప్ లేని ప్రాంతాన్ని రాయల సీమలో మనం చూడగలమా అని అన్నారు.
2014 తరవాత టీడీపీ పాలనలో రూ.12 వేల కోట్లకు పైగా నిధులను రాయలసీమలోనే సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టి గొప్ప ఫలితాలు సాధించామని చెప్పారు. కరువు సీమను సస్యశ్యామలం చేస్తూ మరోవైపు పారిశ్రామికీకరణకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్, కర్నూలులో ఓర్వకల్ హబ్, అనంతపురం జిల్లాలో కియా, విండ్ పవర్, సోలార్ ద్వారా సీమలో ప్రగతిని వేగవంతం చేశామన్నారు. తిరుమల, తిరుపతి అభివృద్ది జరిగిందంటే టీడీపీ హయాంలోనే అన్న విషయం అందరికీ తెలుసని సిఎం అన్నారు. కడప, కర్నూలు ఎయిర్ పోర్టు నిర్మించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అని గుర్తుచేశారు.
టీడీపీ క్యాడర్ మంచి ఉత్సాహంతో పనిచేస్తున్నారని, ఈ సభ ద్వారా రాయలసీమలో నూతన ఉత్సాహం వస్తుందని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో హార్టికల్చర్, పరిశ్రమలు, డెయిరీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హార్టికల్చర్ ద్వారా వచ్చే మార్పులతో రాయల సీమ ప్రజలు కోనసీమ రైతులను అధిగమిస్తారని…ఈ ఫలితాలు రానున్న 4 ఏళ్లలో చూస్తామని అన్నారు. పార్టీ నేతలు ఈ అంశాలు అన్నీ ప్రజల్లో చర్చించాలని అన్నారు.
Also Read : Kashish Chaudhary Sensational Position :బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్ గా కాశీష్ చౌదరి