నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి

ప్ర‌స్తావించిందే త‌ప్పా నిందితుడు కాదు

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఏకంగా ముగ్గురి పేర్ల‌ను చేర్చింది. వారిలో ఏఐసీసీ మాజీ చీఫ్ స్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా చేర్చ‌డం క‌ల‌క‌లం రేపింది. రాజ‌కీయ వ‌ర్గాల‌ను విస్మ‌య ప‌రిచేలా చేసింది.

ఇది ప‌క్క‌న పెడితే ఈడీ తాజాగా రాస్ ఎవెన్యూ ఢిల్లీ కోర్టులో ఈ కేసుకు సంబంధించి కీల‌క నివేదిక అంద‌జేసింది. అందులో త‌ల్లీ కొడుకులు సోనియా, రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ల‌బ్ది పొందార‌ని ఆరోపించింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 142 కోట్లు అప్ప‌నంగా పుచ్చుకున్నార‌ని, ఇది పూర్తిగా మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగిందంటూ పేర్కొంది ఈడీ.

అయితే సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండ‌డంపై చ‌ర్చ జ‌రుగుతోంది. కాగా త‌న పేరును ఈడీ చేర్చిందే త‌ప్పా నిందితుడిగా పేర్కొన‌లేదు. యంగ్ ఇండియా (YI), అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) లకు విరాళాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకులలో రేవంత్ రెడ్డి కూడా ఒకరు కావ‌డం గ‌మ‌నార్హం.

ఏప్రిల్ 9న‌ స్థానిక కోర్టు ముందు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో, ప్రధానంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ YI ద్వారా AJL కు చెందిన సుమారు రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను సంపాదించడానికి ఒక పథకాన్ని రూపొందించారని ఆరోపించారు. రెడ్డి, దివంగత అహ్మద్ పటేల్ , పవన్ బన్సల్ వంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు 2019 నుండి 2022 మధ్య YI మరియు AJL లకు విరాళాలు ఇవ్వమని వ్యక్తులను ప్రభావితం చేశారని స్ప‌ష్టం చేసింది ఈడీ.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com