సోనియా సంక‌ల్పం తెలంగాణ ఆవిర్భావం

ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కామెంట్స్

హైద‌రాబాద్ – ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం. ఎంద‌రో చేసిన త్యాగాలు, బ‌లిదానాలు, పోరాటాల వ‌ల్ల రాష్ట్రం సిద్దించింద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆనాడు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్లే రాష్ట్రం ఏర్పాటైంద‌న్నారు.

స్వేచ్ఛ,సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు కున్నామ‌న్నారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేలేద‌న్నారు. అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు.

డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం మొదలు పెట్టామ‌న్నారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంద‌ని, వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని వాపోయారు. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత త‌మ‌పై ఉంద‌న్నారు.

కట్టుబానిసత్వాన్ని, వెట్టి చాకిరీని తెలంగాణ సమాజం సహించదన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళుతున్నామ‌ని చెప్పారు. గత పదేళ్లలో నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నామ‌ని అన్నారు సీఎం.

నిర్లక్ష్యానికి గురైన యూనివర్శిటీలకు వీసీలను నియమించామ‌ని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామ‌ని అన్నారు. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశామ‌న్నారు.. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, HRC సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నామ‌ని తెలిపారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ సమాజానికి పునాది మహిళలే. అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నామ‌ని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశామ‌న్నారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించామ‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com