కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన కామెంట్స్ పై కన్నడ నాట సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. కన్నడ భాష అనేది తమిళం లోంచి పుట్టిందంటూ పేర్కొన్నారు. తాజాగా తను నటిస్తున్న థగ్ లైఫ్ సినిమా రిలీజ్ కానుంది. ప్రమోషన్ లో భాగంగా కమల్ హాసన్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. కన్నడ నాట కలకలం సృష్టించాయి. ఇది పూర్తిగా విద్వేష పూరితమైనదిగా , కావాలని వ్యాఖ్యానించినట్లు అర్థమవుతోందంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు.
చివరకు సీఎం సిద్దరామయ్య సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నాడు. ఒక నటుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవన్నాడు. ఇరు ప్రాంతాల మధ్య,, ప్రజల మధ్య ఉద్రిక్తతను రాజేసేలా కమల్ హాసన్ మాట్లాడటం దారుణమన్నాడు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు సీఎం.
మరో వైపు భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు సైతం కమల్ హాసన్ పై భగ్గుమన్నారు. ఆయన ముందు నుంచి ఈ దేశం పట్ల పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారంటూ ఆరోపించారు. ఆయన సినిమాలు కన్నడ నాట ఆడకుండా చేయాలని కోరాడు రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ను. మరో వైపు తను నటించిన థగ్ లైఫ్ ను బ్యాన్ చేయాలని విన్నవించారు. దీనిపై తీవ్రంగా స్పందించాడు కమల్ హాసన్. తాను కావాలని కామెంట్ చేయలేదన్నాడు. ఉన్నదే మాట్లాడానని చెప్పాడు.
తాను అన్నదాంట్లో తప్పేముందంటూ ప్రశ్నించాడు. ఒకవేళ తప్పు అని తేలితే తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించాడు ఇలయ నాయగన్ కమల్ హాసన్.