అమరావతి – ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సంచలన ప్రకటన చేసింది. ఏపీలో త్వరలో తమ కంపెనీకి సంబంధించి ఐటీ క్యాంపస్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలియ చేసింది. తమకు సంపూర్ణ మద్దతు తెలియ చేశారని, అన్ని వసతులు కల్పించేందుకు సహకరిస్తామని చెప్పడంతో నూతన క్యాంపస్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు.
ఇదిలా ఉండగా విశాఖపట్నంలోని కాపులుప్పాడలో 22 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది ఐటీ కంపెనీ కాగ్నిజెంట్. ఈ క్యాంపస్ వల్ల దాదాపు 8 వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. ప్రధానంగా ఆర్లిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ రంగాలలో జాబ్స్ ను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. భారీ ఎత్తున ఖర్చు చేసి క్యాంపస్ రూపొందిస్తామని తెలిపింది కంపెనీ.
వచ్చే 2029వ సంవత్సరం నాటికి కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ తొలి దశ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది కాగ్నిజెంట్. గురువారం ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పేర్కొంది. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేసిన కాగ్నిజెంట్ కంపెనీని ప్రత్యేకంగా అభితనందనలతో ముంచెత్తారు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల.