టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ ఆలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తక్షణమే క్షమాపణ చెప్పి తీరాలంటూ కొందరు డిమాండ్ కూడా చేశారు. సాటి నటుడిని పట్టుకుని ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్ ను ఏకి పారేస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఆలీ, ఇతర నటులు హాజరయ్యారు. వేదిక పైన ఉన్న నటకిరీటి బూతులు మాట్లాడటం మొదలు పెట్టారు. ఏరా ఆలీగా..ఆ నా కొడుకు ఎక్కడ అంటూ నోరు జారారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమైంది. ఈ ఇష్యూ చిలికి చిలికి గాలి వానగా మారడంతో కొందరు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరికొందరు రాజేంద్ర ప్రసాద్ కు ఇది అలవాటుగా మారిందంటూ మండిపడ్డారు.
తాజాగా ఆలీనే కాదు ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై కూడా నోరు జారారు. రాబిన్ హుడ్ మూవీ ఈవెంట్ సందర్బంగా తను చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. చివరకు స్టేజి పైనే క్షమాపణలు చెప్పాడు.
ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా స్పందించాడు నటుడు ఆలీ. రాజేంద్ర ప్రసాద్ చెడు ఉద్దేశంతో అన లేదన్నాడు. కేవలం ప్రేమతో తనను ఉద్దేశించి అన్నాడని, అనుకోకుండా నోరు జారిందన్నాడు. ఎవరూ పట్టించు కోవద్దని, ఇంతటితో ఈ వివాదానికి తెర దించాలని కోరాడు మీడిమా సాక్షిగా కమెడియన్. అంతే కాదు రాజేంద్ర ప్రసాద్ గొప్ప నటుడని, ఆయన వ్యక్తిగతంగా కొంత ఇబ్బందిలో ఉన్నాడని తెలిపాడు. ఫ్రస్టేషన్ కు గురై అలా అని ఉంటాడని వెనకేసుకు వచ్చాడు.
