న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఆ పార్టీ అగ్రనేత, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర ఎన్నికల సంఘంపై. ఎన్నికల నిర్వహణ లోప భూయిష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేయడంతో ఈసీ సీరియస్ గా స్పందించింది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీని తమ కార్యాలయానికి రావాల్సిందిగా ఆహ్వానించింది. ఈసీ కార్యదర్శి ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇందులో తమకు కావాల్సిన వివరాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని, ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఇదిలా ఉండగా ఈసీ రాసిన సుదీర్ఘ లేఖకు స్పందించింది ఏఐసీసీ. ఈ మేరకు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల జాబితాతో పాటు ఆయా రాష్ట్రాలలో నిర్వహించిన పోలింగ్ కు సంబంధించిన పూర్తి ఫుటేజ్ లను ఇవ్వాలని కోరింది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ, పార్టీ నాయకత్వం లేవనెత్తిన అంశాలను చర్చించేందుకు ఈసీఐ అధికారులతో కలిసేందుకు తాము సిద్దంగా ఉన్నామని పేర్కొంది.
అయితే సమావేశానికి ముందు కీలకమైన వివరాలు, ఆధారాలు సమర్పించాలని కోరింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఖర్చును కూడా తామే భరిస్తామని తెలిపింది. డిజిటల్ కాపీలు కావాలని తెలిపింది.
