ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను శిక్షించాలి – నారాయ‌ణ

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సీపీఐ కార్య‌ద‌ర్శి

అమ‌రావ‌తి – సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్దించే వారెవరయినా పవన్ కళ్యాణ్ తో సహా శిక్షించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం క్రూరమైనది అంత‌కంటే అరాచకమైనదని అన్నారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు..పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడని ప్ర‌శ్నించారు.

పవ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల‌ గురుంచి గతంలో తాను ఎప్పుడూ మాట్లాడ లేద‌న్నారు. సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ నెత్తి కెక్కించు కోవ‌డం వ‌ల్ల‌నే తాను స్పందించాల్సి ఉంద‌న్నారు . బుధ‌వారం నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. అత్యంత క్రూరమైన సనాతన ధర్మాన్ని పాటించే వారితో పాటు ప‌వ‌న్ ను కూడా శిక్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని అంటున్నారని, కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలని అని నారాయ‌ణ‌ అన్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత వాక్యాలు చేసిన మాట వాస్తవమేనని, సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా అని ప్రశ్నించానని అన్నారు.

వాచస్పతి గరికపాటి నర్సింహారావు ను అడ‌గాల‌న్నారు. సనాతన ధర్మంలో ఒకసారి పెళ్లయిన తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత వెధ‌వ‌ పనులు చేసినా అతనితోనే కాపురం చేయాలని, చివరికి భర్త చనిపోతే అదే చితి మంటలో భార్యను కూడా తగల బెడతారనేది సారాంశమని నారాయణ అన్నారు.

సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ విడాకులు ఎలా ఇచ్చారని ఆయన పునరుద్ఘాటించారు. సెక్యులరిజాన్ని నాశనం చేసే ఈ సనాతన ధర్మాన్ని పాటించే వారిని శిక్షించాలని, విమర్శించే వారిని కాదని నారాయణ స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com