రొమాంటిక్ బాయ్ గా డార్లింగ్ ప్ర‌భాస్

రాజా సాబ్ టీజ‌ర్ లో హీరో హ‌ల్ చ‌ల్

పాన్ ఇండియా హీరో ప్రభాస్ న‌టించిన రాజా సాబ్ టీజ‌ర్ ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త‌న‌ను ఇందులో పూర్తిగా ల‌వ‌ర్ బాయ్ గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు మారుతి. త‌ను గ‌తంలో ప‌లు విజ‌య‌వంత‌మైన మూవీస్ తీశాడు. టేకింగ్, మేకింగ్ ప‌రంగా డిఫ‌రెంట్ ఉంటుంది. అందుకే త‌న‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు ప్ర‌భాస్. ప్ర‌స్తుతం త‌నకు విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేదు. ఇదే స‌మ‌యంలో త‌ను న‌టించిన చిత్రాల‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి.

త‌ను కొర‌టాల శివ‌, ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో స‌క్సెస్ ఫుల్ మూవీస్ లో న‌టించాడు. మిర్చి సూప‌ర్ హిట్, జ‌క్క‌న్న తీసిన బాహు బ‌లి 1, 2 మూవీస్ రికార్డుల మోత మోగించాయి. కాసుల వ‌ర్షం కురిపించాయి. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ లో న‌టించాడు. ఇది బిగ్ స‌క్సెస్. ఆ త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌ల్కి చిత్రం సూప‌ర్ హిట్. ఇది దేశ వ్యాప్తంగా విడుద‌లై రూ. 1000 కోట్లు సాధించింది. దీంతో దీనిని అశ్వ‌నీద‌త్ సీక్వెల్ తీసే ప‌నిలో ప‌డ్డాడు.

ఇక ప్ర‌భాస్ గ‌తంలో ల‌వ‌ర్ బాయ్ పాత్ర‌లో మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ మూవీ చేశాడు. మంచి ఆద‌ర‌ణ ల‌భించింది అప్ప‌ట్లో. ఆ త‌ర్వాత విభిన్న పాత్ర‌లు పోషించాడు. ఇక ఆ చిత్రం త‌ర్వాత త‌న‌కు రొమాంటిక్ బాయ్ గా చేసే ఛాన్స్ రాలేదు. పూజా హెగ్డేతో క‌లిసి న‌టించినా అది వ‌ర్క‌వుట్ కాలేదు. తాజాగా మారుతి మాత్రం ప్ర‌త్యేకంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు రాజా సాబ్ లో ప్ర‌భాస్ ను . త‌న డైలాగ్ డెలివ‌రీ కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. మొత్తంగా మ‌రోసారి తాను ల‌వ‌ర్ బాయ్ నంటూ ముందుకు వ‌చ్చాడు. ఇక సినిమా చూడాలంటే డిసెంబ‌ర్ 5 వ‌ర‌కు ఆగాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com