Shah Rukh Khan : మరోసారి జత కట్టనున్నారు బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్(Shah Rukh Khan) , దీపికా పదుకొనే. తాజాగా కింగ్ మూవీ ప్రాజెక్టు స్టార్ట్ కానుంది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు అయిదు సినిమాలలో నటించారు. అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. హిట్ పెయిర్ గా పేరు పొందారు. స్టార్ హీరో బాద్ షా కూతురు సుహానా ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో గెస్ట్ రోల్ పోషించనుంది. ఈ విషయాన్ని ధ్రువీకరించారు స్టార్ హీరో. మొదటగా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాంటిది ఏమీ లేదంటూ పేర్కొంది స్వయంగా దీపికా పదుకొనే. చాలా సినిమాలలో తాను బిజీగా ఉన్నానని, సమయం కేటాయించలేనంటూ స్పష్టం చేయడంతో బిగ్ షాక్ కు గురయ్యారు మూవీ మేకర్స్.
Shah Rukh Khan – Deepika Padukone Movie Updates
దీంతో విషయం తెలుసుకున్న షారుక్ ఖాన్ వెంటనే రంగంలోకి దిగాడు. తాను స్వయంగా దీపికా పదుకొనేతో ఫోన్ లో సంప్రదించాడు. ఎలాగైనా సరే గెస్ట్ రోల్ తన కోసమైనా పోషించాల్సిందేనంటూ కోరాడు. దీంతో మనసు మార్చుకుంది ముద్దుగుమ్మ బాలీవుడ్ బ్యూటీ. తనకు సంబంధించి డేట్స్ కుదరక పోయినా, తనకు వీలున్న తేదీలు చెబితే అంత వరకు సినిమా షూటింగ్ ను వాయిదా వేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
షారుఖ్ ఖాన్ తనయురాలు కో రోల్ పోషిస్తున్న కింగ్ మూవీకి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. పుకార్లకు పుల్ స్టాప్ పెట్టాడు బాద్ షా. ఇదే సమయంలో దీపికా పదుకొనేకు ఆల్టర్నేటివ్ గా కత్రినా కైఫ్ , ప్రీతి జింటా, సోనమ్ బజ్వా ను కూడా మూవీ మేకర్స్ సంప్రదించారని వారు కూడా నో చెప్పడంతో తిరిగి బాద్ షా మరోసారి దీపికా పదుకొనే ఫోన్ చేయడం తప్పకుండా చేయాల్సిందేనంటూ కోరడంతో గత్యంతరం లేక తను ఒప్పుకుందని సమాచారం.
Also Read : Beauty Shruti Haasan :బాధ పడుతున్న లవ్లీ బ్యూటీ శృతీ హాసన్
